రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
Published Wed, Sep 4 2013 5:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
బాపట్లటౌన్, న్యూస్‌లైన్: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ప్రయాణికుడు మృతిచెందిన ఘటన మంగళవారం బాపట్ల పట్టణంలో చోటుచేసుకుంది.
వివరాలు.. కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలేనికి చెందిన నంగు చిన బసివిరెడ్డి (50), సుబ్బరావమ్మ దంపతులు పదేళ్లగా ప్రకాశం జిల్లా, చినగంజాంలో రొయ్యల చెరువుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె వరలక్ష్మిని కర్లపాలెం మండలం కొత్తపాలేనికి చెందిన వ్యక్తికిచ్చి ఏడేళ్ల క్రితం వివాహం చేశారు. అప్పటి నుంచి బసివిరెడ్డి మూడు నెలలకొకసారి కూతురు వద్దకు వచ్చి వెళ్తుంటాడు. వ్యవసాయ ఖర్చులకు కుమార్తెకు డబ్బు కావాలని అడుగగా రూ.28 వేలు తీసుకుని బసివిరెడ్డి మంగళవారం ఉదయం తిరుపతి-కాకినాడ పాసింజర్‌లో బయలుదేరారు.
చినగంజాం నుంచి బాపట్ల స్టేషన్‌కు సమీపించాక బండి ఆగకముందే దిగేప్రయత్నంలో ప్రమాదవశాత్తు బసివిరెడ్డి జారిపడ్డారు. తోటి ప్రయాణికులు కేకలు వేయడంతో రైలేపోలీసులు, ఆర్‌ఫీఎఫ్ సిబ్బంది అతడిని ప్లాట్‌ఫామ్‌కు తరలించి 108 సమాచారం అందించారు. అప్పటికే బసివిరెడ్డి మృతిచెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదుచేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం బాపట్ల ఏరియావైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు మృతదేహం వద్దకు చేరుకొని విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.
Advertisement
Advertisement