ప్రాధాన్య పథకాల అమలుకు ప్రత్యేకాధికారిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా కర్నూలుకు వచ్చిన ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ప్రాధాన్య పథకాల అమలుకు ప్రత్యేకాధికారిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా కర్నూలుకు వచ్చిన ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు. ప్రాధాన్య పథకాలకు కేటాయించిన భౌతిక, ఆర్థిక లక్ష్యాలను అధిగమించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. వార్షిక లక్ష్యాలను నెల వారీగా విభజించుకుని అధిగమించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
వివిధ పథకాల అమలుపై వచ్చే సమావేశంలో సవివరంగా సమీక్షిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం ప్రకారం అన్ని శాఖల నుండి చేయాల్సిన పనులపై కార్యాచరణ ప్రణాళికను తెప్పించుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించి మూడేళ్లుగా తాగునీటిని రవాణా చేస్తున్న గ్రామాలకు నీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని జెడ్పీ సీఈఓకు సూచించారు. సమావేశంలో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, జేసీ కన్నబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.