- తట్టుకోలేక వికలాంగుడు గుండెపోటుతో మృతి
- లబోదిబోమంటున్న వృద్ధ దంపతులు
రామచంద్రాపురం: రాజకీయ కక్ష సాధిం పులో భాగంగా టీడీపీ నాయకులు పింఛన్ తొలగించారు. ఆ బాధ తట్టుకోలేక రామచంద్రాపురం మండలం కొత్తవేపకుప్పం పంచాయతీ కొత్త వేపకుప్పం ఎస్టీ కాలనీకి చెందిన వికలాంగుడు కే.దేశయ్య (48) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. కే.దేశయ్యది నిరుపేద కుటుంబం. అమ్మ కే.రమణమ్మ (70) కుష్టు వ్యాధిగ్రస్తురాలు. తండ్రి కే.బోడయ్య (80) వృద్ధుడు. దేశయ్య పుట్టుకతోనే వికలాంగుడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ముగ్గురికీ దేశయ్య, రమణమ్మకు వికలాంగుల కోటా కింద, బోడయ్యకు వృద్ధాప్య పింఛన్ మంజూ రు చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారని టీడీపీ స్థానిక నాయకులు వారిపై కక్షగట్టారు. ప్రస్తుతం పింఛన్ల కోసం జరుగుతున్న సర్వేలో ఆ గిరిజన కుటుంబంలోని ముగ్గురికి పింఛన్లు వస్తున్నాయని, రమణమ్మ ఐడీనెం.354012(వికలాంగురాలు), బోడయ్య ఐడీనెం.546180(వృద్ధాప్య పింఛన్) తొలగించాలని స్థానిక గ్రామ పింఛన్ల సర్వే కమిటీ సభ్యులు పట్టుపట్టారు. వారికి పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి తోడై పింఛన్ల జాబి తాలో వారి పేర్లు తొలగించారు.
పింఛన్లు తొలగించిన వారి జాబితాను శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు పంచాయతీ కార్యాలయం వద్ద అతి కించారు. అమ్మానాన్నలకు పింఛన్ తొలగించడంతో ఎలా బతకాలా అం టూ దేశయ్య తీవ్రంగా బాధపడ్డాడు. గుండెపోటు రావడంతో రాత్రి 9 గంటలకు మృతిచెందాడు. టీడీపీ నాయకులు కక్షగట్టి వైఎస్సార్ సీపీ నాయకుల పింఛన్లు తొలగిస్తున్నారని తెలిపారు.
కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు తొలగించాం
కే.దేశయ్య కుటుంబంలో పింఛన్ల తొలగింపు గ్రామ కమిటీ సభ్యులు, కన్వీనర్ సంజీవరెడ్డి నిర్ణయం మేరకు జరిగింది. నాకు ఎలాంటి సంబంధమూ లేదు.
- గంగాభవానీ, ఎంపీడీవో