ఆర్టీసీలో ఎన్నికల కోలాహలం
మూడు ప్రధాన సంఘాల మధ్యే పోటీ ఫ్లెక్సీలతో నిండిన బస్టాండ్లుగెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న సంఘాలు
నెల్లూరు (టౌన్) : ఆర్టీసీలో ఎన్నికల కోలాహాలం నెలకొంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలు ఈనెల 18వ తేదీన జరగనున్నాయి. వాస్తవానికి గతేడాది జనవరిలో జరగాల్సిన ఈ ఎన్నికలు రాష్ట్ర విభజన కారణంగా ఆగిపోయాయి. ప్రస్తుతం నెల్లూరు రీజియన్ పరిధిలోని 10 డిపోల్లో ఎన్నికల వేడి రాజుకుంది. బస్డాండుల్లో ఫెక్సీలు కట్టి ప్రచారాన్ని ఆయ సంఘాలు హోరె త్తిస్తున్నాయి. రీజియన్ పరిధిలో నెల్లూరు 1, నెల్లూరు 2, గూడూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, వాకాడు, సూళ్లూరుపేట, ఉదయగిరి, రాపూరు డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో మొత్తం 4,300 మంది కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కు కలిగిఉన్నారు.
పోటీలో ఆరు సంఘాలు: ఎన్నికల్లో 6 సంఘాలు పోటీ పడుతున్నాయి. ఏఐటీయూసీ అనుబంధం గా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, వైఎ స్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, సీఐటీయూ అనుబంధ సంస్థ ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఎన్‌టీయూసీ అనుబంధ సంస్థ కార్మిక పరిషత్ పోటీలో ఉన్నాయి.వీటిలో ప్రధానంగా ఎంప్లాయీస్ యూనియన్,నేషనల్ మజ్దూ ర్ యూనియన్,వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ల మధ్యే తీవ్ర పోటీ ఉంది.
ప్రచార హోరు:ఎన్నికలు జరిగే తేదీ సమీస్తుండటంతో అన్ని డిపోల్లో కార్మిక సంఘాలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే ఎంప్లాయీస్ యూని యన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లు నెల్లూరులో బహిరంగ సభలు కూడా నిర్వహించారు. ఆర్టీసీ బస్డాండ్లు ఫెక్సీలతో నిండిపోయాయి. తాము గెలిస్తే కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు చేకూర్చుతామని ఆయా సంఘాలు పోటీలు పడి ప్రచారం నిర్వహిస్తున్నాయి. వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా మాపార్టీ ఎమ్మేల్యేలు అధికార పార్టీపై ఒత్తిడి తీసుకువస్తారని ప్రచారం చేస్తున్నారు.
ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా ఒత్తిడీ తీసుకువస్తాం:
వైఎస్సార్ మజ్దూర్ యూనియన్‌ను గెలిపిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో కార్మికుల గొంతు వినిపిస్తాం. అదే విధంగా కాంట్రాక్టు కార్మికులును రెగ్యులరైజ్డ్ చేయడంతో పాటు ఔట్‌సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగులను నియమించే విధంగా చర్యలు తీసుకుంటాం. - రాంబాబు, రీజనల్ కార్యదర్శి, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్
43 శాతం ఫిట్‌మెంట్ సాధించాం:
ఆర్టీసీలో కార్మికులకు ఎన్నడూ లేని విధంగా 43 శాతం ఫిట్‌మెంట్ సాధించాం. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాం. మా దృష్టంతా మెజార్టీపైనే ఉంది. - నారాయణ, జోనల్ ప్రధాన కార్యదర్శి ఎంప్లాయీస్ యూనియన్
కార్మికులపై పనిభారాన్ని తగ్గిస్తాం:
ఎన్నికల్లో ఎన్‌ఎంయూ గెలిస్తే కార్మికులపై పనిభా రం తగ్గించేందకు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువస్తాం. ఈయూ మూడేళ్ల పాలనలో కార్మికుల హక్కు లు హరించుకుపోయాయి. ఆర్టీసీని పరిరక్షించడం, కార్మికులుకు భధ్రత కల్పించడం ముఖ్య ఉద్ధేశ్యం.
- రమణరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఎంయూ