ఆర్టీసీలో స్వైపింగ్ సేవలు
నెల్లూరు టౌన్/గూడూరు: నగదు, చిల్లర కష్టాల నుంచి బయటపడేందుకు నెల్లూరు ఆర్టీసీ అధికారులు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. చార్జీలను వీటి ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. నాన్‌స్టాప్ బుకింగ్ కౌంటర్లలో 10, ఏసీ బస్సుల్లో 8, సూపర్ లగ్జరీల్లో 6, బస్‌పాస్ జారీ చేసే కౌంటర్లలో 6, శబరిమలై కౌంటర్లో ఒకటి, పార్సెల్ సర్వీసులో ఒకటి మొత్తం 32 మిషన్లను ఏర్పాటు చేశారు. దశలవారీగా 215 మిషన్లను ఏర్పాటు చేయనున్నామని అధికారులు తెలిపారు. చిన్న నోట్లు లేక, కొందరు ఇచ్చే రూ.2 వేల నోట్లకు తిరిగి చిల్లర ఇవ్వలేక, టికెట్‌ను వదులుకోలేక కూడా ప్రయాణికులు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు తెర దించేందుకు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.