రెండో రోజూ బంద్ విజయవంతం
Published Thu, Aug 15 2013 2:57 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో రెండోరోజూ బుధవారం బంద్ కొనసాగింది. అన్నివర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి పాల్గొనడంతో బంద్ విజయవంతమైంది. జనసంచారం లేకపోవడంతో పట్టణాలు, పల్లెలు వెలవెలపోయాయి. ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయూల సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో ప్రభుత్వ సేవలు స్తంభించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.
పాలకొల్లు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రెండో రోజు బుధవారం పాలకొల్లు నియోజకవర్గం బంద్ ప్రశాంతంగా, సంపూర్ణ జరిగింది. జన సంచారం లేక పట్టణం బోసిపోయింది. వర్తక, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె కారణంగా కార్యాలయాలు బోసిపోయాయి. ఆర్టీసీ సమ్మెతో పాల కొల్లు బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. లారీలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో రోడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. పాలకొల్లు మండలంలోని లంకలకోడేరు, దిగమర్రు, అరట్లకట్ట, యలమంచిలి మండలంలోని యలమంచిలి గ్రామాల్లో వంటా వార్పు నిర్వహించి రోడ్డు దిగ్బంధనం చేశారు. పోడూరు మండలంలోని జిన్నూరు, కవిటం గ్రామాల్లో రాస్తారోకో నిర్వహించారు. పాలకొల్లు పట్టణంలో బట్టల షాపులు, కిరాణా దుకాణాలు మూసివేయడంతో నిత్యం రద్దీగా ఉండే న్యూ క్లాత్ మార్కెట్ ఏరియా, మెయిన్‌రోడ్డు, బస్టాండ్ ప్రాంతం జనసంచారం లేక వెలవెల బోయింది.
నిరసనల హోరు
తణుకు : ఏపీ ఎన్జీవోల సమ్మె రెండో రోజూ నిరసనలతో హోరెత్తింది. బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. మునిసిపల్ ఉ ద్యోగులు, రెవెన్యూ, సబ్‌రిజిష్టార్, ట్రెజరీ, పంచాయతీ రాజ్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ తాళాలువేసి ఉ ద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. త ణుకు ఆర్టీసి ఉద్యోగులు బస్‌ల టాప్‌పెకైక్కి నిరసన తె లుపుతూ బస్ డిపో నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి వివిధ సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
సమైక్యాంధ్ర ఉద్యమకారులు మోటార్ బైక్‌ల తో భారీ ర్యాలీ నిర్వహించి సోనియా గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మానవహారాలు ని ర్మించారు. తణుకు ఎన్జీవో జేఏసీ కన్వీనర్ పితాని వెం కట రమణ, కొవ్వూరు డివిజన్ జేఏసీ చైర్మన్ వైవీ సత్యనారాయణమూర్తి, డీఎన్‌వీ కుమార్, భాస్కరరెడ్డి , ఎ.భగవాన్,పీఎన్‌డీ ప్రసాద్, అశోక్‌వర్మ, చీర్ల రా ధయ్య, సంకు మనోరమ, కె. పాండురంగారావు, మారిశెట్టి శేషగిరి, బసవా రామకృష్ణ, టీ.మారుతీరావు,గుబ్బల నర్సింహరావు,గుబ్బల శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement