♦ డీఈఓ దిష్టిబొమ్మ దహనం
♦ ఫీజుల దోపిడీ అరికట్టాలి
♦ ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సుబ్బరాజు
వైవీయూ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఏబీవీపీ నాయకులు ఉదయం నుంచి పాఠశాలల బంద్‌ను పర్యవేక్షించారు. పలుచోట్ల ఇస్కాన్ భోజనం రావడంతో భో జనం పెట్టించిన అనంతరం పాఠశాలలను మూయించారు. బంద్ సందర్భంగా ఏబీవీపీ నాయకులు డీఈఓ కార్యాలయం వద్ద డీఈఓ దిష్టిబొమ్మను దహనం చేశా రు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సుబ్బరాజు మాట్లాడుతూ కేజీ నుం చి పీజీ వరకు ఉచిత విద్యను అం దిస్తానని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మాట తప్పారన్నారు.
ప్రభుత్వం మొద్దునిద్రతో కార్పొరేట్ శక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. అధిక ఫీజులతో తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చిపిప్పి చేస్తున్నాయన్నారు. గ్రామీణ, పేద మధ్యతరగతి విద్యార్థులకు నష్టం కలిగించే క్లస్టర్, కామన్ పాఠశాలలపై నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ఖాళీ గా ఉన్న డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేసి పర్యవేక్షణ పెంచాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిం చి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్నారు. జిల్లాలో ఇష్టారాజ్యంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ, పుస్తకాలు, యూని ఫాం వ్యాపారం చేస్తున్నా జిల్లా విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. డీఎఫ్‌ఆర్‌సీ కమిటీని వెంటనే పునరుద్ధరించి ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీ పీ నాయకులు రామ్మోహన్, ప్రశాం త్, సునీల్, సుబ్బరాయుడు, శ్రీను, సాయి, శంకర్, హర్ష, రాయుడు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
విద్యాసంస్థల బంద్ విజయవంతం
Published Wed, Jun 24 2015 2:54 AM | Last Updated on Tue, Oct 2 2018 8:08 PM
Advertisement
Advertisement