ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు) తిప్పి పంపాలని రాష్ట్రంలోని ఉభయ సభలలో సోమవారం తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు) తిప్పి పంపాలని రాష్ట్రంలోని ఉభయ సభలలో సోమవారం తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన బిల్లు అంతా తప్పులు తడకలుగా ఉన్నందున దాన్ని రాష్ట్రపతికి తిప్పి పంపాలని మంత్రి శైలజానాధ్ ద్వారా స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు ఇప్పించారు. శాసనమండలిలో కూడా మంత్రి రామచంద్రయ్య ఇదే నోటీస్ ఇచ్చారు. టిడిపి కూడా ఇదే తరహా నోటీస్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 12న ఈ తీర్మానం కోసం నోటీస్ ఇచ్చింది. ఆ పార్టీ మొదటి నుంచి సమైక్య తీర్మానం కోసం పట్టుపడుతూనే ఉంది.
బిల్లు విషయంలో రాష్ట్రపతి తప్పేమీలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం అసమగ్ర బిల్లు పంపినట్లు చెప్పారు.