ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద సోమవారం రాత్రి దారి దోపిడి జరిగింది.
ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద సోమవారం రాత్రి దారి దోపిడి జరిగింది. దొంగల ముఠా లారీలను అడ్డగించి.. డ్రైవర్లను బెదిరించి... వారి వద్ద నుంచి నగదును బలవంతంగా లాక్కున్నారు. దీంతో లారీ డ్రైవర్లు సమీపంలోని పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.