ఎడాపెడా అక్రమాలకు తెగబడటం.. ప్రజాధనాన్ని లూటీ చేయడం వారి దినచర్య. ఆనక అధికారం అండతో పాపాల్ని కడిగేసుకోవడం వారికి పరిపాటి. తాడిపూడి, పోలవరం కుడికాలువ వెంబడి ఇదే తంతు నడుస్తోంది. ప్రజాప్రతినిధులు.. అధికారుల అండతో నిత్యం భారీఎత్తున ఎర్ర కంకరను తవ్వుకుపోతున్నారు. దొడ్డిదారిన విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. తిలాపాపం తలాపిడికెడు అన్నచందంగా ఇక్కడ కంకర మాఫియా బుసలు కొడుతోంది. ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద తాడిపూడి కాలువకు గండిపడిన వైనం ఈ వాస్తవాల్ని మరోసారి బహిర్గతం చేసింది.
ఉంగుటూరు : తాడిపూడి కాలువకు ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద రెండోసారి గండి పడటానికి అక్రమార్కులే కారణమనే విషయం మరోసారి వెల్లడైంది. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో చీకటి మాటున సాగిస్తున్న గ్రావెల్ తవ్వకాల వల్లే కాలువ గట్టు తెగిపోయింది. కాలువ గట్లతోపాటు, గట్ల పక్కన గల ఎర్రకంకరను తవ్వి తరలించుకుపోతున్నారు. ఇదే ప్రాంతంలో 2013లోనూ గండి పడింది. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు అక్రమ తవ్వకాలను నిలువరించే ప్రయత్నం చేయకపోగా.. కంకర మాఫియాకు వంతపాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారులకు ఫిర్యాదు చేసినా ఆగని తవ్వకాలు
పోలవరం, తాడిపూడి కాలువ గట్లవెంబడి రాత్రి వేళల్లో పొక్లెయిన్ల సాయంతో కంకర తవ్వి నిత్యం ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. దీనిని దొడ్డిదారిన విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఎవరికి అందాల్సిన సొమ్ము వారికి అందుతుం డటంతో ఈ అక్రమాలకు అడ్డుకట్టవేసే నాథుడు కనబడటం లేదు. ఇదే విషయమై అనేకసార్లు కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి, మీకోసం కార్యక్రమాల్లో ప్రజలు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదం టే కంకర మాఫియా ఎంతగా వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు కాలువ గట్లపై అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానైనా లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉంది. అక్రమ తవ్వకాలు సాగిపోతుంటే పట్టించుకోరేం అని అడిగితే ‘మాకు పిల్లాపాపలు ఉన్నారు. మా జీవితాలను గట్ల కోసం పణంగా పెట్టలేం’ అని కొందరు అధికారులు చెబుతున్నారంటే.. మాఫియా ఎంతగా పేట్రేగిపోతోందో ఇట్టే అవగతం చేసుకోవచ్చు.
10 అడుగులపైనే గండి
గొల్లగూడెం వద్ద తాడిపూడి కాలువకు 10 అడుగుల పైనే గండి పండింది. 2013లోనూ ఇక్కడే గండిపడగా, వరద నీరు తిమ్మాయపాలెం గ్రామంలోని కోడేరు చెరువులో చేరింది. అనంతరం చెరువుకు గండిపడి తిమ్మాయపాలెం నూతన కాలనీ రోడ్డు ముంపునకు గురైంది. సోమవారం వేకువజామున తిరిగి అదే ప్రాం తంలో గండిపడగా తిమ్మాయపాలెం ముంపుబారిన పడింది. గతంలో గండిపడినా అధికారులు పూర్తిస్థారుులో చర్యలు తీసుకోలేదు. దీంతో అదే ప్రాంతంలో రెండోసారి గండి పడిందని రైతులు చెబుతున్నారు. గ్రావెల్‌ను తవ్వేస్తుండటంతో ఉంగుటూరు మండలం పరిధిలో తాడిపూడి, పోలవరం కుడికాలువ గట్లు బలహీనమయ్యూరుు. ఒక్కరోజు మాత్రమే వర్షం కురవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని.. వర్షాలు ఇలాగే కొనసాగితే ఊళ్లు, పంటలు మునగటం ఖాయమని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
వంతెన నిర్మించాలి
ఏటా భారీ వర్షాల వల్ల వరద నీరు రావటంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. 2013 భారీ వర్షాలకు ఇదే ప్రాంతం వద్ద గండి పడింది. అరుునా సరైన చర్యలు తీసుకోలేదు. సోమవారం మరోసారి గండి పడటంతో 60 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తిమ్మయ్యపాలెం వద్ద వంతెన నిర్మించాలి.
- మారిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్
కాంక్రీట్ లైనింగ్ వేయాలని కోరాం
తాడిపూడి కాలువ గట్లను పటిష్టత కోసం కాంక్రీట్ లైనింగ్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరాం. గట్ల పటిష్టానికి చర్యలు తీసుకుంటాం. తవ్విన గ్రావెల్‌ను గట్లపైనే ఉంచేలా చూడాలని
అధికారులను కోరతాం.
- గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే
గట్టు.. ఇదీ లోగుట్టు
Published Wed, Aug 19 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM
Advertisement