ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
Published Tue, Jan 28 2014 12:44 AM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM
దేవీపట్నం, న్యూస్‌లైన్ : ఏజెన్సీలో ఉన్న కొత్తవీధి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతిగృహం నుంచి ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. పదో తరగతి చదువుతున్న కొండమొదలు గ్రామానికి చెందిన వలల శివాజీరెడ్డి, కొక్కెరగూడేనికి చెం దిన తాతి పోసిబాబు, చిన్నారిగండికి చెందిన పండా కనకరాజు ఈనెల 25వ తేదీ ఉదయం నుంచి కనిపించడం లేదని వసతి గృహ సిబ్బంది సోమవారం దేవీపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉద యం ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూఓ బీఎస్ కుమార్ వసతి గృ హానికి వచ్చి ఇతర విద్యార్థులను, సిబ్బందిని ఆరా తీశారు. కనకరాజు గతంలో ఇలాగే సిబ్బంది కళ్లుగప్పి 5 రోజుల పాటు కనిపించకుండా పో యాడని తెలిపారు. విద్యార్థులు పరారవ్వడానికి కారణాలపై విచారణ జరిపి, తగు చర్యలు చేపడతామన్నారు.
గతంలోనూ..
ప్రతిఏటా విద్యార్థులు ఈ వసతిగృహం నుంచి పరారవ్వడం పరిపాటిగా మారింది. గత రెండేళ్లలో ఇద్దరు విద్యార్థులు హాస్టల్ నుంచి పరారయ్యారు. నెల రోజుల తర్వాత ఒకరిని హైదరాబాద్‌లోను, రెండు మాసాల తర్వాత మరొక విద్యార్థిని విశాఖపట్నంలోను పట్టుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు విద్యార్థులు పరారవ్వడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారా.. లేక హాస్టల్‌లో కనీస వసతులు అందడం లేదా, లేక సిబ్బంది కారణంగానా అనే అంశాలపై విచారణ చేయాల్సి ఉంది. విద్యార్థుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని వార్డెన్ వీవీ రమణ, హెచ్‌ఎం మదీనా తెలిపారు. హాస్టల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సీహెచ్ దుర్గారావు తెలిపారు.
Advertisement