సాక్షి, విజయవాడ: చిత్తూరు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా, సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు. తిరుపతి అర్బన్ , కార్వేటినగరం, గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, గంగవరం, పెద్దపంజాణి, పుంగనూరు, సోమల, చౌడేపల్లె, తవణంపల్లి, కుప్పం, రామకుప్పం, వెంకటగిరికోట, శ్రీరంగరాజపురం, బైరెడ్డిపల్లె మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు)
Comments
Please login to add a commentAdd a comment