అనారోగ్యంతో మనస్థాపం చెంది ఓ వ్యక్తి వాటర్‌ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.
వాటర్ ట్యాంకుపై నుంచి దూకడంతో తీవ్రగాయాలు
కలువాయి: అనారోగ్యంతో మనస్థాపం చెంది ఓ వ్యక్తి వాటర్‌ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన కలువాయిలో సోమవారం జరిగింది. అయితే పోలీసులు, స్థానికులు అప్రమత్తం కావడంతో తీవ్రగాయాలతో బయటపడ్డాడు.
స్థానికుల సమాచారం మేరకు.. కనకమహల్ సెంటర్‌కు చెందిన ముసలి రమణయ్య(35) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనస్థాపం చెందిన రమణయ్య సోమవారం ఓవర్‌హెడ్ ట్యాంకుపైకి ఎక్కాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు.
ట్యాంకు కింద వలలు ఏర్పాటు చేశారు. పైకి ఎక్కుతున్న సమయంలో ఆ యువకుడు ఉన్నట్లుండి పైనుంచి దూకాడు. దూకడంలో ట్యాంకు దిమ్మలపై పడి అక్కడి నుంచి కింద ఏర్పాటు చేసిన వలలో పడ్డాడు. అయితే దిమ్మలపై పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. కలువాయిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.