వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
గుంటూరు వెస్ట్ : భజరంగ్ జూట్‌మిల్లు వ్యవహారంలో కార్మికులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యాజమాన్యం దిగిరాని పక్షంలో కఠినచర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమ లాకౌట్‌కు నిరసనగా భజరంగ్ జూట్‌మిల్లు పరిరక్షణ కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి నాయకత్వంలో ప్రతినిధులు ఆదివారం స్థానిక ఐబీలో మంత్రి పుల్లారావును కలిశారు. యాజమాన్య మొండివైఖరిని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఘాటుగా స్పందించిన మంత్రి పుల్లారావు యాజమాన్య ధిక్కార ధోరణిని సహించే ప్రసక్తే లేదన్నారు.
కార్మికమంత్రి అచ్చెన్నాయుడు, కార్మికశాఖ కమిషనర్ వరప్రసాద్‌తో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. జూట్‌మిల్లు పరిరక్షణ కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం భజరంగ్ జూట్‌మిల్లు యాజమాన్య మెడలు వంచుతుందనే భావిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలతో మొదలుపెట్టి కార్మికశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కార్మికుల్లో కోపం కట్టలు తెంచుకోకముందే ప్రభుత్వం తగుచర్యలు చేపట్టాలన్నారు.
మంత్రి పుల్లారావును కలిసిన వారిలో బీజేఎంఎం నాయకులు ఎబ్బూరి పాండురంగ, రాయ నాగేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, సీపీఐ(ఎంఎల్) నాయకుడు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాస్, దళితనేత చార్వాక, ఐఎన్‌టీయూసీ నాయకుడు ఎర్రబాబు, వైఎస్సార్ సీపీ నగర యువజన అధ్యక్షుడు ఎలికా శ్రీకాంత్ యాదవ్, మైనార్టీ అధ్యక్షుడు టింబర్ డిపో జానీ, ఇల్లూరి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు న్యాయం చేస్తాం
Published Mon, Jul 13 2015 12:37 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement