నేడు సాక్షి స్పెల్‌బీ రెండో ద శ పరీక్ష | Today is the second phase of the examination sakshi spell bee | Sakshi
Sakshi News home page

నేడు సాక్షి స్పెల్‌బీ రెండో ద శ పరీక్ష

Published Sun, Nov 9 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

Today is the second phase of the examination sakshi spell  bee

 ఒంగోలు వన్‌టౌన్: సాక్షి ఇండియా స్పెల్‌బీ రెండో దశ పరీక్ష ఆదివారం ఒంగోలు రామ్‌నగర్ 7వ లైనులోని భాష్యం పబ్లిక్ స్కూలులో నిర్వహిస్తున్నట్లు సాక్షి ఇండియా స్పెల్‌బీ పరీక్ష నిర్వాహకులు తెలిపారు. ఈ పరీక్షకు వివిధ కేటగిరీల నుంచి మొత్తం 163 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. సాక్షి స్పెల్‌బీ మొదటి దశ పరీక్షలో కేటగిరీ-1, 2, 3, 4లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 163 మందిని రెండో దశ పరీక్షకు ఎంపిక చేశారు.  

కేటగిరీ-1 విద్యార్థులకు ఉదయం 10 గంటలకు, కేటగిరీ-2 విద్యార్థులకు మధ్యాహ్నం 12 గంటలకు, కేటగిరీ-3 విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలకు, కేటగిరీ-4 విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలకు, కేటగిరీ-4 విద్యార్థులకు మధ్యాహ్నం 4 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నుంచి లైవ్‌లో విద్యార్థులకు ప్రశ్నలు చెప్తారు.

ఈ ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు రాయాలి. రెండో రౌండ్‌లో ప్రతిభ కనబరిచిన 20 శాతం మందిని, మూడో రౌండ్‌కు ఎంపిక చేస్తారు. సెమీఫైనల్‌గా భావించే మూడో రౌండ్ పరీక్ష విజయవాడలో నిర్వహిస్తారు. రెండో రౌండ్ పరీక్షకు ఎంపికైన విద్యార్థులు ఆయా కేటగిరీలకు నిర్దేశించిన సమయానికి  హాజరుకావాలని నిర్వాహకులు తెలిపారు.

విద్యార్థులందరూ తప్పనిసరిగా తమ పాఠశాల యూనిఫాంలో రావాలి. పాఠశాల యాజమాన్యం జారీ చేసిన గుర్తింపు కార్డులు, మొదటి రౌండ్ పరీక్షకు హాజరైనప్పుడు, స్పెల్‌బీ నిర్వాహకులు జారీ చేసిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్లపై సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకొని  పరీక్ష కేంద్రానికి తీసుకురావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement