తిరుపతి కల్చరల్: శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు సోమవారం నుంచి మూడు రోజులపాటు తిరుపతిలోని ఇస్కాన్‌లో అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని కమలమందిరాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. సుందరమైన పుష్పాలతో రాధాకృష్ణులను, గోపికల ప్రతిమలను అలంకరించి కొలువు తీర్చారు.
ఇస్కాన్ మందిరంలో బాలకృష్ణుని జన్మవృత్తాంతాన్ని తెలిపే విధంగా ఏర్పాటు చేసిన వర్ణ చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీకృష్ణుని భక్తితత్వాన్ని చాటే ఫొటో ఎగ్జిబిషన్, భక్తులకు ఆహ్వానం పలుకుతూ సుందరమైన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇస్కాన్ రోడ్డులో ట్రాఫిక్‌ను మళ్లించారు. రాధాకృష్ణులను భక్తులందరూ దర్శించుకునేందుకు వీలుగా ఇస్కాన్ మందిరం లో ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు.
ఇస్కాన్‌లో నేటి కార్యక్రమాలు
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా ఇస్కాన్ మందిరంలో సోమవారం ఉదయం 4.15 గంటలకు హారతి, 9 గంటలకు శృంగార హారతి, 9 నుంచి రాత్రి 11.45 గంటల వరకు దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు వైభవంగా ఉట్లోత్సవం జరుగుతుంది. 7 గంటలకు ముఖ్య అతిథుల సందేశం, 7.15 గంటలకు మందిర అధ్యక్షుల సందేశం, 7.30 గంటలకు ఆధ్యాత్మిక నాటిక ప్రదర్శన ఉంటాయి. రాత్రి 12 గంటలకు రాధాగోవిందులకు మహా శంఖాభిషేకం నిర్వహిస్తారు.
నేడు ఇస్కాన్‌లో కృష్ణాష్టమి వేడుకలు
Published Mon, Aug 18 2014 4:22 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM
Advertisement