ఇరగవరం, న్యూస్‌లైన్ : అధికారులు స్పందించారు.. అయ్యవారు కరుణించారు.. 10 గ్రామాల ప్రజలకు సూక్ష్మ వడపోత పద్ధతిలో శుద్ధిచేసిన తాగునీటిని అందించేందుకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేశారు. ‘అయ్యవారు వస్తేనే నీళ్లిస్తారట’ శీర్షికన గతనెల 12న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ మంచినీటి ప్రాజెక్ట్‌ను ఆదివారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రాజెక్ట్‌ను ప్రారంభింప చేస్తున్నట్టు అధికార వర్గాలుశనివారం తెలిపారుు.
జాతీయ తాగునీటి పథకంలో భాగంగా రూ.9 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ మంచినీటి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మూడు నెలల క్రితం పూర్తి చేసిన విషయం విదితమే. దీనిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభింపచేయూలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణరుుంచారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తరుునా ప్రజలకు గుక్కెడు నీళ్లు అందని దుస్థితి నెల కొంది. ‘సమర సాక్షి’ ఉద్యమంలో భాగంగా ఈ విషయూన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. స్పందించిన ఎమ్మెల్యే కారుమూరి 20రోజుల్లోనే దీనిని 10 గ్రామా ల ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటిం చారు. ఎట్టకేలకు ఆదివారం దీనిని ప్రారంభించేం దుకు ముహూర్తం ఖరారు చేశారు.
పది గ్రామాలకు వరం
ఈ ప్రాజెక్టు వల్ల 10 గ్రామాల్లోని 7,500 మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రాజెక్టు అందుబాటులోకి రానుండటంతో ఇరగవరం, గుబ్బలవారి పాలెం, యర్రాయి చెర్వు, వేండ్రవారి పాలెం, గొల్లమాలపల్లి, అనుమాజి పాలెం, పిల్లివారిపాలెం, చినరాముని చెర్వు, గొల్లగుంట, కావలిపురం పంచాయితీ పరిధిలోని యర్రాయి చెర్వు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముహూర్తం కుదిరింది
Published Sun, Jan 5 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement