
మేదినరావుపాలెంలో వైఎస్ విగ్రహావిష్కరణ
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయులని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేదల తలరాతలు మార్చాయాని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.
మేదినరావుపాలెం (దెందులూరు), న్యూస్‌లైన్ : దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయులని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేదల తలరాతలు మార్చాయాని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మేదినరావుపాలెం సెంటర్‌లో గ్రామ సర్పంచ్ అంగడాల సీతారామమ్మ అధ్యక్షతన వైఎస్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు, పెన్షనర్ల సాధక బాదకాలు గుర్తించి వారి కష్టాలను తీర్చి ప్రజా నేత వైఎస్ అని పేర్కొన్నారు. పార్టీ గ్రామాధ్యక్షుడు మేడికొండ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మేడికొండ పద్మావతి, నాయకులు అంగడాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా :కారుమూరి
దెందులూరు నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు, వైఎస్ అభిమానులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా నేరుగా తనకు ఫోన్ చేయవచ్చని కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం మేదినరావుపాలెంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మేడికొండ వెంకటేశ్వరరావు అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాలు తన దృష్టికి వచ్చాయని, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని కారుమూరి చెప్పారు.