karumuri venkata nageswarrao
-
నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక కుర్రాడు YSR గురించి ఏమన్నాడంటే
-
మేదినరావుపాలెంలో వైఎస్ విగ్రహావిష్కరణ
మేదినరావుపాలెం (దెందులూరు), న్యూస్‌లైన్ : దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయులని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేదల తలరాతలు మార్చాయాని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మేదినరావుపాలెం సెంటర్లో గ్రామ సర్పంచ్ అంగడాల సీతారామమ్మ అధ్యక్షతన వైఎస్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు, పెన్షనర్ల సాధక బాదకాలు గుర్తించి వారి కష్టాలను తీర్చి ప్రజా నేత వైఎస్ అని పేర్కొన్నారు. పార్టీ గ్రామాధ్యక్షుడు మేడికొండ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మేడికొండ పద్మావతి, నాయకులు అంగడాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటా :కారుమూరి దెందులూరు నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు, వైఎస్ అభిమానులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా నేరుగా తనకు ఫోన్ చేయవచ్చని కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం మేదినరావుపాలెంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మేడికొండ వెంకటేశ్వరరావు అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాలు తన దృష్టికి వచ్చాయని, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని కారుమూరి చెప్పారు. -
ఫ్యాన్‌కు ఓటేశాడని వృద్ధుడి హత్య
* వైఎస్సార్ సీపీ దెందులూరు అభ్యర్థిపై దాడి * అచ్చెన్నాయుడి ప్రోత్సాహంతో యువకుడిని కొట్టిన టీడీపీ కార్యకర్తలు సాక్షి నెట్వర్క్: ఎన్నికల సందర్భంగా బుధవారం పలుచోట్ల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. పలు చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. దొంగ ఓట్లు వే యటానికి ప్రయత్నించిన వారిని నిలదీసి నందుకు చితక్కొట్టారు. ఫ్యాన్‌కు ఓటేశానన్న వృద్ధుడి మీద దాడిచేయటంతో అతడు అక్క డికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడులు, దౌర్జన్యాలకు తోడు టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలింగ్ సమయంలోనూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెంలో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకటనాగేశ్వరరావుపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారుమూరి గన్‌మన్‌కు తీవ్రగాయాలయ్యాయి. కామవరపుకోట మండలం తడికలపూడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఏలూరు పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. గణపవరం మండలం అర్ధవరంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారు. పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనటంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. పాలకొల్లు మండలం అరట్లకట్టలో టీడీపీ వారు ఓటర్లకు గిఫ్ట్‌కూపన్లు పంపిణీ చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి పోలింగ్ బూత్ వద్దే ప్రచారం నిర్వహించారు. పెరవలి మం డలం తీపర్రులో టీడీపీ నాయకులు నకిలీ నోట్లు పంచటంతో ఓటర్లు ఆందోళన చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరం మండలం ఇనగంటివారిపేటలో ఓటేసి వస్తున్న మెర్ల దశయ్య (70)ను టీడీపీ నాయకుడుమొగతడకల వెంకటమోహన్ ‘ఎవరికి ఓటేశావు’ అని అడిగాడు. ‘ఫ్యాన్‌కు వేశా’నని చెప్పడంతోనే వెంకటమోహన్ దుర్భాషలాడుతూ గుండెలపై మోదడంతో దశయ్య కుప్పకూలి మృతి చెందాడు. రామచంద్రాపురం మండలం నరసాపురపేట, కె.గంగవరం మండలం ఉడుమూడి, సుందరపల్లిల్లో దొంగ ఓట్లు వేస్తున్న తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారనే ఆగ్రహంతో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులకు దిగారు. సుందరపల్లికి చెందిన టీవీవీ సత్యనారాయణ, ఉడుమూడికి చెందిన సాదే వెంగళరావు, సాదే భద్రరావులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే కారణంతో రామచంద్రపురంలో వైఎస్సార్ సీపీ నాయకుడు కొండేపూడి సురేష్‌పై టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సోదరుడి కుమారుడు తోట బాబు, అతడి అనుచరులు దాడిచేసి తల పగులగొట్టారు. కోటనందూరు మండలం అగ్రహారంలో క్యూలైన్లో నిల్చుంటే ప్రచారం చేస్తున్నాడంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్త రమణపై టీడీపీకి చెందిన బర్ల రాజు, యలమంచలి రమణ, మిరియాల మంగ దాడిచేసి గాయపరిచారు. వేట్లపాలెంలో ఓటేసి బయటకొచ్చి ‘ఫ్యాన్’ జోరుగా తిరుగుతోందన్న ఎస్సీ వర్గీయులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఎస్సీలు ప్రతిదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. జ్యోతులపై దాడికి యత్నం గండేపల్లి మండలం సింగరంపాలెంలో చనిపోయిన, పొరుగూరిలో ఉన్న వారి ఓట్లను కూడా టీడీపీ నాయకులు వేయిస్తుండడం గమనించిన వైఎస్సార్ సీపీ ఏజెంట్ అడ్డుకోవడంతో బలవంతంగా బయటకు పంపించేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జగ్గంపేట అసెంబ్లీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పోలింగ్ బూత్‌కు చేరుకుని అధికారులను నిలదీశారు. ఇంతలో అక్కడకు వచ్చిన టీడీపీ నేతలు నెహ్రూను దూషిస్తూ దాడి చేయబోయారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదంలో నెహ్రూ అనుచరుడు భూపాలపట్నం ప్రసాద్‌ను కిర్లంపూడి పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. కాకినాడలో సిటీ టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రోద్బలంతో ఏటిమొగకు చెందిన మత్స్యకారులు పెద్దసంఖ్యలో తమ ఓట్లు గల్లంతయ్యాయనే నెపంతో పోలింగ్ సిబ్బందిని రెండుగంటల పాటు నిర్బంధించారు. సాంబమూర్తినగర్‌లో వైఎస్సార్ సీపీ నేత, మాజీ కార్పొరేటర్ కొప్పుల విజయకుమారి ఇంట్లోకి కాంగ్రెస్, టీడీపీ నేతలు చొరబడి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ దౌర్జన్యం చేయటంతో వైఎస్సార్ సీపీ వారు ఆందోళన చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి చంద్రశేఖర రెడ్డి అక్కడికి చేరుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొండంగి మండలం పెరుమాళ్లపురం పోలింగ్‌బూత్‌లో బూత్ లెవెల్ అధికారి.. ఓటర్ స్లిప్‌లు లేని వారికి పోలింగ్ స్టేషన్లోనే స్లిప్‌లు ఇస్తుండగా వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నావంటూ టీడీపీ వారు ఆయనపై దౌర్జన్యానికి దిగారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగిలో మూడు నెలల కింద మరణించిన తన సోదరుడి ఓటు వేసేందుకు వచ్చిన టీడీపీ వర్గీయుడిని నిలదీసిన ఓ యువకుడిపై ఆ పార్టీ కార్యకర్తలు దాడిచేశారు. మరణించిన బంటాల శివ ఓటు వేసేందు కు అతడి తమ్ముడు యివ్వరాజు పోలింగ్ బూత్‌లోకి రాగా బగాది సురేష్ అనే యువకుడు నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు సురేష్‌పై దాడి చేశారు. సురేష్ అక్కడికి కొద్దిదూరంలో గల బడ్డ బాబూరావు ఇంటికి వెళ్లిపోయాడు. తెలుగు తమ్ముళ్లు సురేష్‌ను బయటకు ఈడ్చుకొచ్చి మళ్లీ కొట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న అచ్చెన్నాయుడు కార్యకర్తలను మరింత ఉసిగొల్పారు. దీంతో వారు.. సురేష్‌ను రక్షించుకునేందుకు వచ్చిన అతడి తల్లిదండ్రులు బగాది మల్లేసు, సుందరమ్మలపైనా దాడిచేశారు. గాయపడిన సురేష్‌ను టెక్కలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
దర్శకుడు కోదండరామిరెడ్డి కూడా.. హైదరాబాద్: చిత్తూరు ఎమ్మెల్యే సి.కె.బాబు (జయచంద్రారెడ్డి), తణుకు ఎమ్మెల్యే కారుమూరు వెంకట నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. వారిద్దరూ బుధవారం వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో విడివిడిగా కలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నెల్లూరు జిల్లా సీనియర్ నేత వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, చింతలపూడి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు సన్నిహిత సహచరుడైన గంటా మురళి కూడా జగన్‌ను కలిసి పార్టీ లో చేరారు. తన సతీమణి లావణ్యతో వచ్చిన సి.కె.బాబుకు జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లావణ్యకు గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. కారుమూరు పెద్ద సంఖ్యలో తన అనుచరులతో వచ్చి పార్టీలో చేరిన సందర్భంగా నర్సాపురం, ఏలూరు లోక్‌సభ పార్టీ సమన్వయకర్తలు ఎం.ప్రసాదరాజు, తోట చంద్రశేఖర్ కూడా ఉన్నారు. వేణుగోపాల్‌రెడ్డి చేరిక సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా ఉన్నారు. వైఎస్ పథకాలు ఆదర్శనీయం: కారుమూరు పదేళ్ల కిందట భయానకమైన కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజానీకానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలు ఎంతో మేలు చేశాయని, ఇవన్నీ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే అమలవుతాయనే విశ్వాసంతోనే పార్టీలో చేరానని నాగేశ్వరరావు చెప్పారు. వైఎస్ పథకాల వల్ల బడుగు, బలహీనవర్గాలకు ఎక్కువగా మేలు జరిగిందన్నారు. తన లేఖతోనే రాష్ట్రం విడిపోయిందని తెలంగాణలో మాట్లాడుతూ... సీమాంధ్రలో మరో విధంగా చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిలకడలేని నాయకుడని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. సీఎం అంటే వైఎస్సే: కోదండరామిరెడ్డి వైఎస్ నిత్యం నవ్వుతూ ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అలా ఉండేవారని సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రిననే భావం లేకుండా అందరినీ పలకరిస్తూ పేద, బడుగు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని చెప్పారు. వైఎస్ అంటే తనకు అపారమైన గౌరవాభిమానాలున్నాయని, ఆయన కడుపున పుట్టిన బిడ్డగా జగన్ ఆంధ్రప్రదేశ్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే తాను పార్టీలో చేరానని కోదండరామిరెడ్డి వెల్లడించారు. బాబును, బీజేపీని ప్రజలు నమ్మరు: వంటేరు రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబును, దగ్గరుండి విభజన జరిపించిన బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మరని వంటేరు వేణుగోపాలరెడ్డి చెప్పారు. కొత్త రాష్ట్రం జగన్ నేతృత్వంలో అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంద న్నారు. వేణుగోపాలరెడ్డి 1999లో కావలి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. -
ముహూర్తం కుదిరింది
ఇరగవరం, న్యూస్‌లైన్ : అధికారులు స్పందించారు.. అయ్యవారు కరుణించారు.. 10 గ్రామాల ప్రజలకు సూక్ష్మ వడపోత పద్ధతిలో శుద్ధిచేసిన తాగునీటిని అందించేందుకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేశారు. ‘అయ్యవారు వస్తేనే నీళ్లిస్తారట’ శీర్షికన గతనెల 12న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ మంచినీటి ప్రాజెక్ట్‌ను ఆదివారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రాజెక్ట్‌ను ప్రారంభింప చేస్తున్నట్టు అధికార వర్గాలుశనివారం తెలిపారుు. జాతీయ తాగునీటి పథకంలో భాగంగా రూ.9 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ మంచినీటి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మూడు నెలల క్రితం పూర్తి చేసిన విషయం విదితమే. దీనిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభింపచేయూలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణరుుంచారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తరుునా ప్రజలకు గుక్కెడు నీళ్లు అందని దుస్థితి నెల కొంది. ‘సమర సాక్షి’ ఉద్యమంలో భాగంగా ఈ విషయూన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. స్పందించిన ఎమ్మెల్యే కారుమూరి 20రోజుల్లోనే దీనిని 10 గ్రామా ల ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటిం చారు. ఎట్టకేలకు ఆదివారం దీనిని ప్రారంభించేం దుకు ముహూర్తం ఖరారు చేశారు. పది గ్రామాలకు వరం ఈ ప్రాజెక్టు వల్ల 10 గ్రామాల్లోని 7,500 మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రాజెక్టు అందుబాటులోకి రానుండటంతో ఇరగవరం, గుబ్బలవారి పాలెం, యర్రాయి చెర్వు, వేండ్రవారి పాలెం, గొల్లమాలపల్లి, అనుమాజి పాలెం, పిల్లివారిపాలెం, చినరాముని చెర్వు, గొల్లగుంట, కావలిపురం పంచాయితీ పరిధిలోని యర్రాయి చెర్వు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.