- నేడు వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షలు
- పరీక్ష కేంద్రాల్లో వీడియో కవరేజ్
- నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం జరగనున్న వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష గదిలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో 104 వీఆర్‌వో, 188 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్ష తేదీ ఫిబ్రవరి 2గా నిర్ణయించారు.
చిత్తూరు, తిరుపతి, మదనపల్లె డివిజన్ కేంద్రాల్లో పరీక్షలు ఆదివారం నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. చిత్తూరులోని 35 కేంద్రాల్లో 14467 మంది, తిరుపతిలోని 70 కేంద్రాల్లో 38156 మంది, మదనపల్లెలోని 16 కేంద్రాల్లో 8975 మంది వీఆర్‌వో పరీక్ష రాయనున్నారు. వీఆర్‌ఏ పరీక్ష చిత్తూరులో మాత్రమే జరగనుంది. మొత్తం 2158 మంది రాయనున్నారు. వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షలను 750 మంది రాయనున్నారు.
ఆలస్యమైతే అనుమతి లేదు వీఆర్‌వో పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, వీఆర్‌ఏ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరగనుంది. నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష గదిలోకి అనుమతించొద్దని జేసీ బసంత్‌కుమార్ పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు తప్పనిసరిగా అర్ధగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష కేంద్రాల్లో వీడియో కవరేజ్
వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షలనిర్వహణ తీరును వీడియో కవరేజ్ చేయాలని రాష్ట్ర సీసీఎల్‌ఏ ఆదేశించారు. జేసీ ఆదేశాలమేరకు వీడియో కవరేజ్‌కు అవసర మై న ఏర్పాట్లను తహశీల్దార్లు పూర్తి చేశారు. మూడు డివిజన్ కే ంద్రాల పరిధిలో 130 వీడియో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఆర్‌వో శేషయ్య తెలిపారు. హాల్‌టికెట్‌లో ఫొటో సరిగా కనిపించకపోయినా, అసలు లేకపోయినా అభ్యర్థులు ఐడీ ప్రూఫ్‌తో 3 పాస్‌పోర్‌ట ఫొటోలు తీసుకురావాలని పేర్కొన్నారు.
అధికారుల నియామకం: పరీక్ష నిర్వహణకు సంబంధించి అదనపు జిల్లా కోఆర్డినేటర్లుగా ముగ్గురు ఆర్‌డీవోలను, పరీశీలకులుగా 25 మంది జిల్లా అధికారులను నియమించారు. లైజన్ అధికారులుగా 25 మంది తహశీల్దార్లను, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ అధికారులుగా 191 మంది తహశీల్దార్లు, ఎంపీడీవోలను, అసిస్టెంట్ లైజన్ అధికారులుగా 195 మందిని నియమించారు.