నల్లగొండలో ముఖ్యకార్యకర్తల సమావేశం
హాజరుకానున్న రాష్ట్ర నాయకులు
పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సిద్ధం చేయడమే ఎజెండా
సాక్షిప్రతినిధి, నల్లగొండ
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేయడంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొనే ఈ సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఆర్ ఫంక్షన్ హాలులో జరగనుంది. వివిధ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ల నియామకాన్ని దాదాపు పూర్తి చేసిన అధిష్టానం జిల్లా కన్వీనర్ మార్పుతో సంస్థాగతంగా పార్టీపై దృష్టి పెట్టింది. కొద్ది నెలల కిందట రద్దు చేసిన మండల కమిటీలు, జిల్లా కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేసేపనిలో ఉంది. ఇటీవలి పరిణామాలతో వెనకపడిన పార్టీ కార్యక్రమాలను తిరిగి చేపట్టడంలో, జిల్లా కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపి ఎన్నికలకు తయారు చేసేం దుకు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశామని పార్టీవర్గాలు తెలిపాయి. గత ఏడాది జిల్లాలో షర్మిల పాదయాత్ర, విజయమ్మ పర్యటనలు ఇక్కడి కేడర్‌లో సమరోత్సాహాన్ని నింపాయి.
ఈ ఏడాది ఆరంభంలో నిర్వహిస్తు న్న ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎన్నికలకు సిద్ధం కావడమే ఏకైక ఎజెండాగా ముందుకు వెళతామని పార్టీవర్గాలు పేర్కొన్నాయి. 9 నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ల నియామకం పూర్తయింది. మరికొన్ని పెండింగులో ఉన్నా యి. మొత్తంగా సంస్థాగతంగా అన్ని పదవులను భర్తీ చేస్తూనే, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో ముందుకు సాగేందుకు వ్యూహరచన చేస్తోంది. మండల , గ్రామ కమిటీల ఏర్పాటు, పార్టీ ఇతర విభాగాల కమిటీల భర్తీపై జిల్లా నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తిచేసి రాష్ట్ర నాయకత్వానికి నివేదిం చింది. రాష్ట్ర అధ్యక్షుడి ఆమోదముద్ర తర్వాత పదవుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు.
వైఎస్ అభిమానులకు పార్టీని దగ్గర చేస్తాం
‘వైఎస్‌ఆర్ పథకాలతో లబ్ధిపొంది, ఆయనంటే గౌరవం, అభిమానం ఉన్న ప్రతీ ఒక్కరికి పార్టీని ద గ్గర చేస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని తయారు చేసుకోవడం, వారిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం కోసం జిల్లాస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. సమావేశానికి బాజిరెడ్డి గోవర్దన్, శివకుమార్, జనక్‌ప్రసాద్ వంటి తెలంగాణ నాయకులు హాజరవుతు న్నారు..’ అని పార్టీ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
వైఎస్సార్ సీపీ... భేటీ నేడు
Published Fri, Jan 10 2014 2:42 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement