
నెల్లూరు / ఓజిలి: ‘పదమూడేళ్లుగా తక్కువ వేతనాలతో పని చేసినా కనికరం చూపకుండా పర్మినెంట్ చేయమని కోరినందుకు శాశ్వతంగా తొలగించి అక్రమ కేసులు పెట్టించారన్నా’ అంటూ శనివారం ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట పలువురు టోల్‌ప్లాజా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు సమీపంలోని స్వర్ణ టోల్‌ప్లాజాలో 28మంది 2003 నుంచి 2015వరకు పని చేసినట్లు తెలిపారు.
జీతాలు పెంచకపోవడంతో తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ యూనియన్‌ను రూపొందించుకున్నట్లు తెలిపారు. దీంతో జిల్లాకు చెందిన ఓ మంత్రి, టీడీపీకి చెందిన ఓ పారిశ్రామిక వేత్త కలిసి 28 మందిని విధుల నుంచి తొలగించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్రమ కేసులు పెట్టి 15 రోజుల పాటు రిమాండ్ కూడా పంపారని వాపాయారు. స్పందించిన జననేత జగన్ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు.