
టమాట సాగుపై జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధన
మదనపల్లె రూరల్, న్యూస్‌లైన్: టమాట పంటపై జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు సోమవారం మదనపల్లె టమాటా మార్కెట్ యార్డులో పరిశోధన నిర్వహించారు. జర్మన్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ బృం దం రెండు రోజుల క్రితం మదనపల్లెకు చేరుకుంది. ఇక్కడి ఉద్యానవన శాఖ అధికారులతో మాట్లాడి టమాటా సాగు విధానంపై అధ్యయనం చేసింది.
మదనపల్లె ఉద్యానవనశాఖ అధికారి మధుసూధన్‌రెడ్డితో కలసి జర్మన్ శాస్త్రవేత్తలు అలెగ్జాండర్ హడ్డాడ్, హుక్ బ్రాన్‌క్యాంప్ కలసి నాలుగురోజుల పాటు చుట్టుపక్క ల గ్రామాల్లో టమాటా సాగు చేస్తున్న ప్రాంతాలను గుర్తించి పరిశోధనలు నిర్వహించారు.
అనంతరం ఆదేశ డీఐఈ(డెచ్చస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యూర్ ఎన్‌ట్విక్‌లంగ్స్‌పోలిటిక్), జర్మన్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన శాల ఆదేశాల మేరకు మదనపల్లె డివిజన్‌లో టమాటా సాగు, మార్కెట్ సౌకర్యాలు, భూముల సాంధ్రత, యాజమాన్య పద్ధతులు, నూతన సాగు విధానం, రైతులు టమాటాలను ఎలా విక్రయిస్తారు. మండీల తీరు, గిడ్డింగులు, విత్తనాలు తదితర అంశాలపై నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు.
రైతులు చెప్పే ప్రతి విషయాన్ని వీడియో తీసి అప్పటికప్పుడే జర్మన్ దేశానికి సాగు విధానంపై సమాచారం చేరవేస్తూ వచ్చారు. టమాటా మార్కెట్‌లో సుమారు వంద మంది రైతులను, 20 మండీల నిర్వాహకులను, మార్కెట్ అధికారులను కలసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ‘న్యూస్‌లైన్’తో మదనపల్లె ఉద్యానవనశాఖ అధికారితో పాటు జర్మనీ దేశ శాస్త్రవేత్తలు మాట్లాడారు. టమాటా పంటను అధికంగా సాగు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి జర్మన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం ఆదేశాల మేరకు మదనపల్లె, అనంతపురం, తమిళనాడులోని కాట్నగల్, సీలం తది తర ప్రాంతాల్లో మరో రెండు నెలల పాటు టమాటా సాగుపై పరిశోధనలు చేసి పూర్తి అధ్యయనం తర్వాత జర్మనీకి వెళతామన్నారు. వీరి వెంట టమాటా మార్కె ట్ అధికారులు, మండీల నిర్వాహకులు, ఉద్యానవనశాఖ అధికారులు ఉన్నారు.