కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్ : జిల్లాలో టమాటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 15రోజుల కిందట వరకు కిలో రూ. 20 నుంచి రూ. 30లు పలికిన ధర నేడు కిలో రూ. 5లకు పడిపోయింది. దిగుబడి లేనప్పుడు ధర బాగా ఉండి... దిగుబడి పెరిగే సమయంలో ధరలు పడిపోవడం పరిపాటిగా మారి రైతులను కుంగదీస్తోంది.
జూన్.జూలై, ఆగస్టు నెలల్లో కిలో టమాటా ధర రూ. 30-40 మధ్య పలకడంతో కొందరు రైతులు అప్పట్లో ఎకరాకు ఖర్చులన్నీ పోను లక్ష నుంచి లక్షన్నర రూపాయల దాకా లాభాలు గడించారు. దీంతో మరికొంత మంది రైతులు సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో కురిసిన వర్షాలకు జిల్లాలో సరాసరి 6, 500 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున ఈ పంట మార్కెట్‌కు 120 టన్నుల దిగుబడి వస్తోందని ఉద్యాన అధికారులు తెలిపారు. 15-20 రోజుల కిందట గంప (20 నుంచి 30 కిలోలు) రూ. 600 నుంచి రూ. 1200 పలికింది. ప్లాస్టిక్ బాక్స్ (15 నుంచి 20 కిలోలు) రూ. 450 నుంచి రూ. 800 పలికింది.
కొందరు రైతులైతే మార్కెట్ ధరలను చూసి అధిక వడ్డీలకు అప్పుతెచ్చి మరీ పంట సాగు చేశారు. ఇప్పుడున్న ధరలతో పంటను అమ్ముకోలేక, కూలీలకు కూలి ఖర్చులు కూడా ఇవ్వలేక, అప్పులకు వడ్డీలు చెల్లించలేక లబోదిబో అంటున్నారు. ఇదే టమోటా కిలో రైతు వద్ద వ్యాపారులు, దళారులు రూపాయి లెక్కన కొనుగోలు చేసి వాటిని మార్కెట్‌కు తరలించి కిలో 4 రూపాయలకు చిరువ్యాపారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. టమోటాలు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఇక్కడ నుంచి తరిలించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పెట్టుబడి కూడా రావడం లేదు
నేతు రెండెకరాల్లో టమోటా సాగు చేశాను. పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చినా ధర లు లేవు. మార్కెట్‌కు 30 కిలోల గంప ట మోటాలు తీసుకుపోతే కమీషన్, దెబ్బతిన్న కాయలు 2 కిలోల తొలగింపు, ఆటో ఖర్చు లు కలిపి రూ.14 పోను రూ.16 చేతికొచ్చిం ది. ఇలా అయితే పెట్టుబడి కూడా రాదు.
- గోవింద్‌రెడ్డి, టమాట రైతు, గొర్లపల్లె
ధరలు విషయం మా చేతుల్లో లేదు
అటు ఖరీఫ్, ఇటు ర బీ దాటి పంట దిగుబ డులు మార్కెట్‌ను ముంచెత్తడంతో ధరలు తగ్గాయి. దీంతో రైతులకు పెట్టుబడులు కూ డా రాని పరిస్థితి ఉంది. సాగుకు సహాయం అందించగలం గానీ, ధరల విషయంలో తాము చేసేదేం ఉండదు. అదంతా ప్రభుత్వం, మార్కెటింగ్‌శాఖలే చూసుకుంటాయి.
- మధుసూదనరెడ్డి,
అసిస్టెంట్ డైరక్టర్, జిల్లా ఉద్యానశాఖ-1
కుప్పకూలిన టమోటా ధరలు
Published Mon, Jan 13 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement
Advertisement