
శాసనసభ్యులకు శిక్షణా తరగతులు
హైదరాబాద్ : ఈనెల 18, 19 తేదీల్లో శాసనసభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సభా వ్యవహారాలపై సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖులు వస్తున్నట్లు చెప్పారు. తొలిరోజు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు శిక్షణ ఇస్తారని కోడెల తెలిపారు.
రెండోరోజు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, నజ్మా హెప్తుల్లా శిక్షణ ఇస్తారని, వినోద్ రాయ్, సుభాష్ కశ్యప్ ప్రసంగించనున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని గ్రాండ్ కాకతీయ హోటల్లో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు కోడెల తెలిపారు.