హజ్‌ యాత్రికులకు శిక్షణ | training to haztravelers | Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్రికులకు శిక్షణ

Published Wed, Jul 27 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

training to haztravelers

అక్కయ్యపాలెం: హజ్‌ యాత్రకు వెళ్లే హాజీలంతా అక్కడి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్సీ ఎం.ఎ.షరీఫ్‌ అన్నారు. యాసీన్‌ హజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ మంగళవారం అక్కయ్యపాలెం షాదీఖానా కల్యాణ మండపంలో హజ్‌ యాత్రికులకు శిక్షణ ఇచ్చింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత్రకు ఎలా వెళ్లాలి, అక్కడి పరిస్థితులు, ఏయే ప్రదేశాలలో ఎలా మెలగాలనే విషయాలను వివరించారు. ఈ ఏడాది విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 78 మంది హజ్‌కు బయలుదేరుతున్నట్టు తెలిపారు. యాసిన్‌lహజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ కార్యదర్శి రెహ్మతుల్లా బేగ్‌ మాట్లాడుతూ ఆగస్టు 24న యాత్ర ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో హజ్‌ కమిటీ చైర్మన్‌ అహ్మద్‌ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఎ.రెహమాన్, ఏక్యూజే  కళాశాలల డైరెక్టర్‌ ఐ.హెచ్‌.ఫరూఖి, డాక్టర్‌ జహీర్‌ అహ్మద్, యాసిన్‌ మసీద్‌ ప్రతినిధి అహ్మదుల్లా ఖాన్‌ పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement