హైదరాబాద్-విజయవాడ-విశాఖ రైళ్ల పునరుద్ధరణ | Trains restored between Vijayawada - Visakhapatnam Section | Sakshi
Sakshi News home page

హైదరాబాద్-విజయవాడ-విశాఖ రైళ్ల పునరుద్ధరణ

Published Mon, Oct 28 2013 6:32 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

హైదరాబాద్-విజయవాడ-విశాఖ రైళ్ల పునరుద్ధరణ

హైదరాబాద్-విజయవాడ-విశాఖ రైళ్ల పునరుద్ధరణ

భారీ వర్షాలకు విజయవాడ డివిజన్లో ట్రాక్పైకి వరద నీరు చేరడంతో రద్దు చేసిన రైళ్లను పునురుద్ధరించారు. విజయవాడ-విశాఖపట్నం సెక్షన్ల మధ్య దెబ్బతిన్న ట్రాక్ను సోమవారం సాయంత్రానికి సిద్ధం చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.

రద్దు చేసిన, దారి మళ్లించిన కొన్ని రైళ్లను మళ్లీ యధాతథంగా విజయవాడ-విశాఖపట్నం మార్గంలో నడపనున్నారు. వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం జన్మభూమి రాత్రి 7:10 గంటలకు బయల్దేరనుంది. ఆదివారం బయల్దేరాల్సిన నిజాముద్దీన్-విశాఖపట్నం స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్, అలప్పూజ-ధన్బాద్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్, త్రివేండ్రమ్-గువహటి ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్-హౌరా ప్యాసింజర్ స్పెషల్ సర్వీసులను మళ్లీ పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement