నిధులున్నా నిష్ర్పయోజనం | tribal funds not spend in adilabad, lack of co-ordination beween two departments | Sakshi
Sakshi News home page

నిధులున్నా నిష్ర్పయోజనం

Published Fri, Aug 23 2013 2:38 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

tribal funds not spend in adilabad, lack of co-ordination beween two departments

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం గిరిజనులకు శాపంగా మారిం ది. వారి అభివృద్ధికి ప్రభుత్వం లక్షల రూపాయలు విడుదల చేస్తున్నా ఆ దిశ గా నిధులను వినియోగించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. పైగా వైద్యశాఖ అధికారులు నిధు లు వెచ్చించడంలేదని ఐటీడీఏ.. నిధుల మంజూరు విషయమే తమకు తెలియదని వైద్యశాఖ అధికారులు పేర్కొంటుండడం కొసమెరుపు. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల పరిస్థితి.
 - న్యూస్‌లైన్, ఉట్నూర్
 
 ప్రభుత్వం మావోరుుస్టు ప్రభావి త ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయ డం ద్వారా వారి ప్రభావాన్ని తగ్గించొచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తోం ది. ఇందులో భాగంగా 2012-13ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఐటీడీఏ ఆధీనంలోని గిరిజన ఇంజినీరింగ్ విభాగానికి 140 అభివృద్ధి పనుల కోసం రూ. 26 కోట్ల 97లక్షల 35 వేల నిధులు కేటారుుంచింది. ఇందులోంచి రూ.30 లక్షలు విద్య, ఆరోగ్యంపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు విడుదల చేసింది. ఏటా జ్వరాలు, సీజనల్ వ్యాధులతో ఈ ప్రాంతంలో ఎందరో గిరిజనులు చనిపో తున్నారు. వీటిని అడ్డుకోవడానికి గిరిజ నులకు విద్య, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఈ నిధులు కేటారుుంచింది.
 
 నిధు లు ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఇంజినీరిం గ్ విభాగానికి విడుదలై నెలలు గడుస్తు న్నా ఒక్క రూపారుు కూడా ఖర్చు పెట్టలేదు. ఇందులో సుమారు రూ.25 లక్షల తో వైద్యశాఖ అధికారులు వ్యాధుల ని వారణ, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమా లు నిర్వహించాల్సి ఉంది. కళాజాత బృందాలు, గోడ రాతలు, వాల్‌పోస్టర్లు తదితర పద్ధతుల ద్వారా చైతన్యపర్చా లి. మిగతా రూ.5 లక్షలు విద్య అవగాహనకు వెచ్చించాల్సి ఉంది. అరుుతే ఈ ని ధులు విడుదలైనట్లు తమకు తెలియదని ఆయూ శాఖల అధికారులు పేర్కొనడం అందరినీ విస్మయూనికి గురిచేస్తోంది. గత నెలలో కలెక్టర్ సమీక్ష సమావేశం ద్వారా రూ.30 లక్షల నిధుల విషయం తెలిసిందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఆయూ శాఖల మధ్య స మన్వయలోపంతో నిధులున్నా ప్రయోజనం లేకుండా పోరుుంది.
 
 సీజనల్ వ్యాధులు..
 ఏజెన్సీ వ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నారుు. దీనికితోడు గిరిజన గ్రా మాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తం గా మారింది. దీంతో సీజనల్ వ్యాధులు,జ్వరాలు విస్తరిస్తున్నారుు.  ఇప్పటికే ఏజె న్సీ మండలాల్లో సుమారు 18 మంది జ్వరాలు, సీజనల్ వ్యాధులతో చనిపోయూరు. సిర్పూర్ (యూ) వంటి మండలాల్లో డయేరియూ విజృంభించడంతో పల్లెలు మంచం పడుతున్నారుు. ఈ నేపథ్యంలో గిరిజనుల ఆరోగ్య రక్షణకు అవగాహన కల్పిస్తే వారికి కొంత మేలు జరి గే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు.. నిధులు ఖ ర్చు చేయడంలేదు. వీరి నిర్లక్ష్య వైఖరితో ఎందరో అమాయకులు జ్వరాలతో చని పోతున్నారని గిరిజనులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. తమ కోసం విడుదలైన నిధులు ఖర్చు చేయడంలో ఎందుకు కాలయూపన చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి నిధులు సద్వినియోగమయ్యేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.
 
 నిధులు ఖర్చు చేయలేదు..
 గిరిజనులకు విద్య, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి 2012-13 సంవత్సరానికి ఐఏపీ కింద రూ.30 లక్షలు విడుదలయ్యాయి. కానీ ఇంతవరకు అయా శాఖల అధికారులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో నిధులు విడుదల చేయలేదు. సంబంధిత శాఖలు కార్యక్రమాలు నిర్వహిస్తే ఐటీడీఏ పీవో అనుమతితో నిధులు విడుదల చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.         
 - శంకరయ్య, ఈఈటీడబ్ల్యూ, ఉట్నూర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement