ఆదివాసీల హక్కులను పరిరక్షించాలి
Published Mon, Aug 8 2016 11:18 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
కెరమెరి : ఆదివాసీల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్రం భగవంత్‌రావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పులు, వాయిద్యాలతో కళా ప్రదర్శన చేశారు. అనంతరం ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవంత్‌రావు మాట్లాడారు. చట్టాలు, హక్కులు, గిరిజన సంస్కృతిని కాపాడాలంటే అందరూ కలిసికట్టుగా ఉద్యమాలు, పోరాటాలు చేయక తప్పదన అన్నారు. మంగళవారం ఉట్నూర్‌లో నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖైరీ, బాబేఝరి, కెలి(కే), కెలి(బి), ఉమ్రి తదితర గ్రామాల ఆదివాసీలు, ఆదివాసీ గిరిజన సంఘం ఆసిఫాబాద్ డివిజన్ కార్యాదర్శి మడావి కన్నిబాయి, నాయకులు మూట ఎల్లయ్య, వెలది జ్యోతిరాం, మేతిరాం, పోచయ్య, రాజయ్య పాల్గొన్నారు.
Advertisement