ఉట్నూర్, న్యూస్‌లైన్ : బంగారు భవిష్యత్తు కోసం గిరిజన విద్యాలయాల్లో చేరుతున్న విద్యార్థులు మృత్యుఒడికి చేరుతున్నారు. విద్యనందించాల్సిన గిరిజన ఆవాసాలు ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. తమ లక్ష్యం సాధించకుండానే ప్రాణాలు అనంత వాయువుల్లో కలుస్తు న్నాయి. తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్చుతున్నారు. బా గా చదువుకుని సమాజానికి, తల్లిదండ్రులకు, గురువులకు పేరు తీసుకొస్తారనుకుంటే మ ధ్యలోనే వెళ్లి‘పోతున్నారు’. ప్ర ధానంగా గిరిజన విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినీవిద్యార్థులకు భద్రత లేకపోవడమే కారణం. గురువులు విద్యార్థుల భవిష్యత్తుకు, ప్రాణాలకు భరోసా ఇవ్వడం లేదు.
సిబ్బంది ఇష్టారాజ్యం
ఐటీడీఏ ఆధ్వర్యంలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో జిల్లావ్యాప్తంగా దాదాపు 45,571 మంది గిరిజ న విద్యార్థులు ఆశ్రమ, గురుకుల, కేజీబీవీ, రెసిడెన్షియ ల్, మినీ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఉచిత భోజన వసతితో కూడిన విద్య అంది స్తోంది. వీరి పరిరక్షణ బాధ్యతను ఆయా సిబ్బంది, గిరిజన సంక్షేమ అధికారులు చూసుకుంటారు. చాలా చోట్ల ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బం ది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులకు జ్వరం వచ్చినా, అనారోగ్యం పాలైన పట్టించుకోవడం లేదు. విద్యార్థులు రాత్రి, పగలు అనుమతి లేకుండా బయటకు వెళ్లిన అడిగే వారు లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది.
46 మంది విద్యార్థులు బలి
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో విద్యాలయాల్లో 2006 సె ప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 46 మంది విద్యార్థులు అనారోగ్యం, జ్వరం, ఆత్మహత్య, ప్రమాదాలు, పాముకాటుతో మృతిచెందారు. వీరిలో అధికంగా అనా రోగ్యంతో ఆశ్రమాల్లో చదువుతూ మృతిచెందిన వారు ఉండటం కలవరానికి గురిచేస్తోంది. విద్యాలయాల్లో చ దువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి చేయిదాటితే త ప్పా సిబ్బంది, వైద్య సిబ్బంది పట్టించుకోరనే ఆరోపణ లున్నాయి. సకాలంలో స్పందించి కనీసం వారి తల్లిదం డ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపించి ఉంటే చాలా మంది బతికే వారు.
ఇదీకాక విద్యార్థులకు మెనూ ప్ర కారం భోజనం అందించకపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గి అనారోగ్యానికి గురవుతున్నారు. నీళ్ల చారు, ఉడకని అన్నం పెడుతున్నారు. ప్రభుత్వం విద్యార్థుల వారీగా డ బ్బులు విడుదల చేస్తున్నా అధికారులు, సిబ్బంది కుమ్మ క్కై నాణ్యమైన ఆహారం, వైద్యం, విద్య అందించడం లే దు. బోధకులు, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, వార్డెన్లు స్థానికంగా ఉండక పోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్ష ణ కరువవడం విద్యార్థుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతుంది. గిరిజన విద్యను పర్యవెక్షించే డీడీటీడబ్ల్యూ పోస్టు ఖాళీగా ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
నిబంధనలు గాలికి..
గిరిజన విద్యాలయాల్లో విద్యార్థులను తల్లిదండ్రులు కలవాలంటే వార్డెన్ అనుమతి తీసుకుని, వారి వివరాలు మూమెంట్ రిజిస్టర్‌లో పొందుపరిచాకే కలవనియాలి. కానీ, ఈ విధానం అమలుకావడం లేదు.
విద్యాలయాల్లో విద్యార్థులు చేరే ముందు వారి తల్లిదండ్రులకు ఐడీ కార్డు జారీ చేస్తారు. మరోకటి పాఠశాలలో పెడతారు. ఆ కార్డులో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ఫొటోలు ఉంటాయి. ఆ ఫొటోలో ఉన్న వారు కార్డు తీసుకొస్తేనే విద్యార్థులను కలువడానికి లేదా ఇళ్లకు పంపడానికి అవకాశం ఇవ్వాల్సి ఉండగా ఎక్కడ కానరావడం లేదు.
విద్యాలయాల్లో రాత్రివేళ విధులు నిర్వహించే సిబ్బంది సరిగ్గా ఉండటం లేదు. సమస్యలు వస్తే పట్టించుకునే వారు కరువయ్యారు.
సాయంత్రం వేళ విద్యార్థుల హాజరు వార్డెన్ తీసుకోవాలి. కాని ఆ పనిని విద్యార్థులకు అప్పగించడంతో విద్యార్థులు ఎవరున్నారో తెలియని పరిస్థితి.
విద్యార్థులను బయటకు పంపించడానికి వీలు లేదు. ముఖ్యంగా బాలుర విద్యాలయాల్లోని విద్యార్థులు తమ ఇష్టారీతిన బయటకు వస్తున్నారు.
మృత్యుకూపాలు
Published Sat, Mar 1 2014 2:30 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement