గెడ్డ అవతల నుంచి ఆటోను మోసుకువస్తున్న గిరిజనులు
విశాఖపట్నం, అరకులోయ: ముంచంగిపుట్టు మండలంలోని మారుమూల లక్ష్మిపురం పంచాయతీ పరిధి లోని ముత్తగుమి రోడ్డులో ఇటీవల కురిసిన వర్షాలకు కాజ్‌వే పూర్తిగా కొట్టుకుపోవడంతో గిరిజనులు ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగిస్తున్నారు. ఎంతో కష్టపడి తమ వాహనా లను ఒడ్డుకు చేరుస్తున్నారు. రెండు రోజులుగా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్ష్మిపురం పంచాయతీతో సరిహద్దులో ఉన్న ఒడిశాలోని 80 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అత్యవసర ప్రయాణానికి గిరిజనులంతా నరకయాతన పడుతున్నారు. గెడ్డలో నీటి ఉధృతి అధికంగా ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. బైక్‌లు, ఆటోలను అతికష్టంపై గెడ్డను దాటిస్తున్నారు. గెడ్డ ఉధృతి తగ్గే వరకు గిరిజనులంతా మండల కేంద్రానికి చేరుకోవడానికి అవస్థలు తప్పేటట్టు లేవు. అనేక గ్రామాల గిరిజనులకు మండల కేం ద్రంతో రవాణా సంబంధాలు తెగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment