
తిరుమలలో కళ్యాణకట్ట(ఫైల్)
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలో పనిచేస్తున్న సురేశ్ బాబు అనే క్షురకుడిపై టీటీడీ అధికారి రామారావు దాడి చేశారు. అక్కడితో ఆగకుండా కులం పేరుతో దూషించారు.
దీనిపై బాధితుడు కళ్యాణకట్ట డిప్యూటీ ఈవో బేబీ సరోజినికి ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన రామారావుపై చర్య తీసుకోవాలని కోరాడు. బాధితుడికి న్యాయం జరగకపోతే ఆందోళన చేపడతామని క్షురకుల సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఈవోకు నివేదిక ఇస్తామని డిప్యూటీ ఈవో తెలిపారు.