ఆధునికీకరణకు నిధులివ్వాలి
- గోవాడ, తుమ్మపాల సుగర్స్‌కు రూ.100 కోట్లు చొప్పున మంజూరు చేయాలి
- ప్రభుత్వానికి వామపక్ష నేతల డిమాండ్
- ఫ్యాక్టరీలను సందర్శించిన బృందం
అనకాపల్లి: హుదూద్ తుపాను కారణంగా తీ వ్రంగా నష్టపోయిన గోవాడ, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం రూ.100 కోట్ల చొప్పు న మంజూరు చేయాలని జిల్లా వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. మండలంలోని తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని బుధవారం సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజె స్టాలిన్, సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాధం, వామపక్ష నేతలు కొండబాబు, రామచంద్రరావు, వీవీఎమ్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఫ్యాక్టరీ యంత్రాలను, గొడౌన్, స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీపై వేలాది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. తుపానుకు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. పంటనష్టాన్ని పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. గ్రామీ ణ ప్రాంతాలలో 25 కిలోల బియ్యం మూడునెలల పాటు ఉచితంగా ఇవ్వాలన్నారు. జిల్లాలో తుపానుపై నష్టం వివరాలు నమోదు చేసి తమ పార్టీ నేతలకు అందజేస్తామన్నారు. వామపక్ష నేతలు బాలకృష్ణ, కోన లక్షణ్, రాజాన దొరబాబు, ఆడారి అప్పారావు పాల్గొన్నారు.
జాతీయ విపత్తుగా పరిగణించాలి
చోడవరం: హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా పరిగణించి దెబ్బతిన్న సహకార చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం ఆదుకోవాలని వామపక్షాల బృందం డిమాండ్ చేసింది. సీపీఐ,సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ, సీపీఎం లిబరేషన్, ఎం సీపీఐ లకు చెందిన నాయకుల బృందం గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని బుధవారం సందర్శించింది. ఉత్తరాంధ్ర జిల్లాల ను తుపాను తీవ్రంగా నష్టపరిచినందున జాతీ య విపత్తుగా కేంద్రం పరిగణించాలని బృంద సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక వామపక్షాల నాయకులు రెడ్డిపల్లి అప్పలరాజు, మట్టారమణ, నాగిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.