- హాజరుకానున్న కేంద్రమంత్రి జైరాం రమేష్
- పదమూడేళ్లపాటు ప్రాజెక్టు అమలు
- రూ.168 కోట్లతో అభివృద్ధి పనులు
- మారనున్న పర్వతగిరి రూపురేఖలు
సాక్షి, హన్మకొండ: ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న పుర (ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియా) పథకం ప్రారంభం కానుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ సోమవారం ఈ పథకాన్ని ప్రారంభించన్నునారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు పర్వతగిరి మండలాన్ని ఎంపిక చేశారు. మొదట ఈ పథకాన్ని ఆదివారం ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అది సోమవారానికి వాయిదా పడింది. మూడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు జిల్లాకు మంజూరైనా ఇప్ప టి వరకు ప్రారంభించ లేదు. దాంతో అసలు పథకం జిల్లాలో అమలవుతుం దా లేదా అనే సందేహాలు ఇంతకాలం నెలకొన్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి కొన్ని రోజు ల ముందుగా ఈ పథకం ప్రారంభం కానుండడం జిల్లాకు శుభపరిణామం.
గ్రామాలు స్వయంపోషకాలు..
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలను నిరోధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘పుర’ పథకాన్ని చేపట్టింది. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయడం ద్వారా గ్రామాలు పట్టణాల తరహాలో స్వయం పోషకాలుగా అభివృద్ధి చెందడంతో పాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతారుు. రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతోంది. ఈ పథకం కింద పర్వతగిరి మండలానికి రూ.168.52 కోట్లు కేటాయించనున్నారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం వాటా 73 శాతం అంటే రూ.123.34కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 15 శాతం అంటే రూ.25.80 కోట్లతో పాటు భాగస్వామ్య సంస్థల వాటా 11 శాతం అంటే రూ.19.38కోట్లు ఉంటాయి. వీటితో పర్వతగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు.
జనవరిలో కదలిక
పురా పథకంలో భాగంగా 2011లో మన రాష్ట్రంలో వరంగల్, కృష్ణ జిల్లాలను మొదటిదశలో ఎంపిక చేశారు. మూడేళ్ల కిందట మంజూరైనా ఈ సంవత్సరం జనవరిలో కదలిక వచ్చింది. పురా పథకం కింద ఎంపికైన పర్వతగిరి మండలంలోని పది గ్రామపంచాయతీల్లో రూ.8.34 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చేదాటిపోతుందనుకున్న పథకానికి జీవం వచ్చినట్టైంది. జనవరిలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అంతా అనుకున్నారు. అయితే జనవరిలో అసెంబ్లీ సమావేశాలు, ఫిబ్రవరిలో పార్లమెంటు సమావేశాలు ఉండటంతో ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఎన్నికల నోటిఫికేషన్‌కు కొన్ని రోజుల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ పథకం ప్రారంభానికి ముహూర్తం కుదిరింది.
మినీ టౌన్లుగా పల్లెలు..
ఎంపిక చేసిన మండలంలో పదమూడేళ్లపాటు ప్రాజెక్టు నిర్వాహణ చేయాల్సి ఉంటుంది. పురా ప్రాజెక్టు కింద వెచ్చించే నిధులతో పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, చింతనెక్కొండ, రోళ్లకల్, నారాయణపురం, సోమారం, జమాళ్లపురం, పర్వతగిరి, కల్లెడ, రావూరు, పెద్దతండ గ్రామాలను మినీటౌన్లుగా తీర్చిదిద్దుతారు. గ్రామాల్లో నిరంతరాయంగా సాగునీరు, తాగునీరు సౌకర్యాలు కల్పిస్తారు. వ్యవసాయం, కూరగాయల పెంపకంలో అధునాత పద్ధతులు అనుసరించడంలో శిక్షణ ఇస్తారు. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వచేసేందుకు కోల్డ్‌స్టోరేజ్‌లు నిర్మిస్తారు. పంటలు తరలించేందుకు ప్రత్యేక వాహనాల ఏర్పాటు, అండర్‌గ్రౌండ్ డ్రెరుునేజీ, విద్యత్ దీపాలంక రణ, ఇంటర్‌నెట్ సదుపాయాలు, రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఈ పథకం పూర్తిస్థాయిలో అమలైతే వరంగల్ నగరానికి శాటిలైట్ సిటీగా పర్వతగిరి మండలం రూపాంతరం చెందుతుంది.