
ఒకే కాన్పులో రెండు దూడలు
విజయనగరం: ఒక ఆవు ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనిచ్చింది . ఈ సంఘటన మంగళవారం విజయనగరం జిల్లా గొర్ల మండలం గూడెం గ్రామంలో జరిగింది. మహాశివరాత్రి పర్వదినం నాడు ఆవు ఒకే కాన్పులో రెండు దూడలను కనడం అందరిని ఆశ్చర్యంలో ముంచింది.
ఆవు ఒకే కాన్పులో రెండు దూడలను కనడం అరుదైన సంఘటనగా స్థానికులు భావిస్తున్నారు. ఆవుకు వైద్యసేవలు చేసిన వెటర్నరీ డాక్టర్ రెడ్డి కృష్ణ మాట్లాడుతూ ఇలా పుట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. మగ దూడకు టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని, అదే సమయంలో ఆడ దూడకు పునరుత్పత్తిలో సమస్యలు ఏర్పడతాయని తెలిపారు.