
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. విజయవాడలో ఒకటి, కాకినాడలో మరొకటి తాజాగా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ రెండు కేసులూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి లండన్ నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి రాజమండ్రికి వచ్చాడు. మరో వ్యక్తి ఫ్రాన్స్ నుంచి ఈ నెల 17వ తేదీన విజయవాడకు వచ్చాడు. వీళ్లిద్దరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు అధికారులు గుర్తించారు. వీరిని బోధనాసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. వీరిద్దరూ ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరితో తిరిగారు.. అన్నది ఆరా తీస్తున్నారు. వారి బంధువులను సైతం వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువస్తున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివే.
Comments
Please login to add a commentAdd a comment