జవాబుల్లేని ప్రశ్నలు.!
► విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం!
► ప్రశ్నపత్రాల్లో తరచూ తప్పులు
► మొన్న టెన్త్, నిన్న ఏపీఆర్‌జేసీ
► తప్పులకు బాధ్యులెవరని ప్రశ్నిస్తున్న విద్యార్థులు
కర్నూలు(జిల్లా పరిషత్) : పరీక్షలు విద్యార్థుల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. భవిష్యత్‌లో వారు ఏమి కావాలో దిశా నిర్దేశం చేస్తాయి. అలాంటి పరీక్షలకు ప్రశ్నపత్రాలను తయారు చేసే మేధావులు విద్యార్థుల జీవితంలో ఆడుకుంటున్నారు. సిలబస్‌లో లేనివి, సమాధానాలు లేనివి, ప్రశ్నే తప్పుగా ఇస్తూ విద్యార్థులను అయోమయానికి గురవుతున్నారు. అర్థంకాని ఈ ప్రశ్నలను చూసి నేర్చుకున్నవి కూడా మరిచిపోయేటట్లు చేస్తున్నారు.
మొన్న జరిగిన పదో తరగతి పరీక్షల్లోనూ, నిన్న జరిగిన ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షలోనూ ఇదే విధమైన తప్పులు దొర్లాయి. ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షలో ప్రధానంగా విద్యార్థులకు పదో తరగతి సిలబస్‌లోని ప్రశ్నలు ఇవ్వాలి. కానీ ప్రశ్నపత్రం తయారు చేసే వారు పాతసిలబస్‌లోని ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా రాయలేక బిక్కమొహం వేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. రేపు ఫలితాలు ఎలా వస్తాయోనన్న ఆందోళన వారికి ఇప్పటి నుంచే మొదలైంది. ఎవరో చేసిన తప్పుకు మేమెందుకు బలికావాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్ సొసైటీ వారు ఏపీ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రతి యేటా ఏపీఆర్‌జేసీ సెట్ నిర్వహిస్తారు. ఈ యేడాది కూడా ఈ నెల 8వ తేదిన పరీక్ష నిర్వహించారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నపత్రం తయారు చేస్తారు. ఎంపీసీ(మ్యాథ్స్), సైన్స్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీలో బయాలజీ, సైన్స్ కలిపి 200 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
అయితే ఎంపీసీలో 12 ప్రశ్నలు పాతసిలబస్ నుంచి ఇవ్వగా, 5 ప్రశ్నలు సమాధానాలు లేనివి ఇచ్చారు. సైన్స్‌లో 14 ప్రశ్నలు పాతసిలబస్ నుంచి ఇచ్చారు. బైపీసీలో 16 ప్రశ్నలు పాతసిలబస్ నుంచి ఇచ్చారు. సైన్స్‌లో 14 ప్రశ్నలు అసలు సిలబస్‌లో లేనివి ఇచ్చారని విద్యార్థులు వాపోతున్నారు. ఆయా సబ్జక్టుల వారీగా విద్యార్థులను అయోమయానికి గురిచేసిన ప్రశ్నల వివరాలు ఇలా ఉన్నాయి.
భౌతిక రసాయన శాస్త్ర విభాగంలో విభాగానికి సంబంధించిన ప్రశ్నపత్రంలో కోడ్ సిలో ఇచ్చిన పాతసిలబస్‌కు చెందిన ప్రశ్నలు(కొత్త సిలబస్‌లో లేనివి)
1. శుద్దగతి శాస్త్రం 118, 119, 122 ప్రశ్నలు
2. న్యూటన్ గమన నియమాలు 120, 121 ప్రశ్నలు
3. ధ్వని 111, 125 ప్రశ్నలు
4. బలం, పీడనం 111, 125 ప్రశ్నలు
5. ఘర్షణ 110 ప్రశ్న
6. సౌర కుటుంబం 115 ప్రశ్న
7. ద్రవాల పీడనం 123 ప్రశ్న
8. పెట్రోలియం, బొగ్గు 116 ప్రశ్న
9. సహజ దృగ్విషయాలు 114 ప్రశ్న
10. కృత్రిమ దారాలు 113 ప్రశ్న
-బయాలజిలోని కోడ్ సిలో 51, 54, 60, 68, 72, 79, 80, 84, 87, 88, 90, 91, 92, 93, 96, 98 కలిపి మొత్తం 16 ప్రశ్నలు పాత సిలబస్ నుంచి ఇచ్చారు.
జవాబులు లేని ప్రశ్నలు
శ్రేఢులు 80, 81, 82 ప్రశ్నలు
త్రికోణమితి 97వ ప్రశ్న
వర్గబహులు 65వ ప్రశ్న
66వ ప్రశ్న సిలబస్‌లో లేనిది ఇచ్చారు.