సమైక్యాంధ్ర ఉద్య మం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఉద్యమ దండులా ముందుకు కదిలి సమైక్యవాణి వినిపించాయి.
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్య మం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఉద్యమ దండులా ముందుకు కదిలి సమైక్యవాణి వినిపించాయి. అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు భారీ ఎత్తున సాగాయి. పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బుజబుజనెల్లూరులో ర్యాలీ చేశారు.
గూ డూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీ వయ్య సూళ్లూరుపేటలో ర్యాలీ నిర్వహించారు. కావలి సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి మర్రిపాడు నుంచి ఆత్మకూరు వరకు, తిరిగి మర్రిపాడు వ రకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో వెంకటగిరిలో ర్యాలీ జరిగింది.