సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్ర సమరం ప్రపంచానికి తెలియజేసేందుకు తిరుమల ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈనెల 24వ తేదీ చేపట్టనున్న సీమాంధ్ర బంద్‌లో భాగంగా చేపడుతున్న రహదారుల దిగ్బంధం తిరుమల రహదారులకూ వర్తిస్తుందని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్డీవో రామచంద్రారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈమేరకు 24వ తేదీ తిరుమలకు ఆర్టీసీ, ప్రయివేటు, పబ్లిక్ వాహనాల రాపోకలను అనుమతించేది లేదని తెలిపారు.
మొదట ఈనెల 14, 15 తేదీల్లో బంద్ ప్రకటించిన జేఏసీ వెంకన్న భక్తులెవరూ ఇబ్బంది పడకూడాదని అప్పట్లో తాత్కాలికంగా వాయిదా వేసింది. ముందుగా బంద్ తేదీలను ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పాలని అప్పట్లో భావించింది. శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం తమకు లేదని, సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని వివరించారు. భక్తులు తమకు సహకరించి 24వ తేదీ తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.
సమైక్య సమరం ప్రపంచానికి చాటాలని..
Published Sat, Sep 21 2013 4:12 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement