కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బాలశౌరి ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను చంచల్గూడ జైల్లో కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి గతనెల మొదటివారంలోనే రాజీనామ చేశారు.
14వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరి తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు బాలశౌరి మద్దతు తెలిపిన విషయం విదితమే.