
'పురందేశ్వరికి కాంగ్రెస్ వాసన పోలేనట్టుంది'
విజయవాడ: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆంధ్రప్రదేశ్ లో పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకుడు వర్ల రామయ్య తప్పుబట్టారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... పురందేశ్వరికి ఇంకా కాంగ్రెస్ వాసన పోలేనట్టుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఐదేళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. కేంద్రం, రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన నడుస్తోందన్నారు.