వరుణుడిపైనే ఖరీఫ్ ఆశలు | Varunudi kharif hopes | Sakshi
Sakshi News home page

వరుణుడిపైనే ఖరీఫ్ ఆశలు

Published Thu, Jun 19 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

వరుణుడిపైనే ఖరీఫ్ ఆశలు

వరుణుడిపైనే ఖరీఫ్ ఆశలు

  • దుర్భిక్షం
  •  వర్షాలు కురిస్తేనే సాగునీరు
  •  దేవుడిపైనే భారం
  •  ఎండిన మంచినీటి చెరువులు
  •  గ్రామాల్లో దాహం కేకలు
  • విజయవాడ సిటి : ఈ ఏడాది ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. జూన్ నెల పూర్తికావస్తున్నా నేటికి చినుకు రాలకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కోసం 20 రోజుల నుంచి ఎదురుచూపులు చూస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో కాలువలు, చెరువులు ఎండిపోయాయి. దుక్కులు దున్ని చినుకురాక కోసం ఎదురుచూపులు చూస్తున్న రైతన్నలు ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఎలా చేపట్టాలో అర్థం కాక అయోమయంలోపడ్డారు.  

    వర్షాలు కురిస్తేనే సాగునీరు విడుదలయ్యే అవకాశం ఉండడంతో వచ్చేనెల వరకు సాగునీటి విడుదల కష్టమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కనీసం మంచినీటికైనా నీరు విడుదల చేస్తారో లేదోనని ప్రజలు ఆందోళన చెం దుతున్నారు.  ఈక్రమంలో  రుతుపవనాలు జాడ లేక వర్షం కురవకపోవడం, భూగర్భజలా లు అడుగంటడంతో  కృష్ణా జిల్లాలో తీవ్ర కరువుపరిస్థితులు నెలకొన్నాయి.

    పశ్చిమ కృష్ణా మెట్టప్రాంతంలో నెలరోజులుగా వర్షాలు లేక మంచినీటికి కూడా ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారు.మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, చల్లపల్లి, ఉయ్యూరు, డెల్టాప్రాంతంలో కూడా అదే పరిస్థితి నెల కొంది. జిల్లాలో రెండువేలకు పైగా మంచినీటి చెరువులు ఎండిపోయాయి. జూన్‌లో కూడా విపరీతమైన వడగాడ్పులు వీస్తుండడంతో జిల్లాలో డెల్టా, మెట్ట ప్రాంతాలలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది.
     
    ఎగువ నుంచి నీరు వచ్చేనా?
     
    కర్ణాటకలో కూడా వర్షాలు లేకపోవడంతో ఆల్మట్టీ, నారాయణపూర్ డ్యామ్‌లలో కూడా జలసిరులు నిండుకున్నాయి. ఈరెండు ప్రాజెక్టులు నిండితేనే శ్రీశైలం,సాగర్‌లోకి నీరు చేరి దిగువనున్న  కృష్ణానదికి విడుదల చేసే పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్ర, సాగర్‌లో వర్షపు నీరు కిందికి వస్తే కృష్ణా డెల్లాకు నీరు విడుదల అయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

    మరోవైపు రాష్ట్ర విభజన జరగడం తెలంగాణా ఎగువ నుంచి నీరు విడుదల మరో సమస్యకానుంది. తూర్పు కృష్ణాలో  ఆరున్నర లక్షల ఎకరాల్లో ప్రతి ఏటా వరినాట్లు వేస్తారు. జూలైలో కూడా సాగు నీరు విడుదల కాకపోతే నాట్లు ఆలస్యమై సెప్టెంబర్, నవంబర్ నె లలో తుఫానులు అధికంగా వచ్చే సీజన్‌లో పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
     
    పశ్చిమ కృష్ణాలో అదే పరిస్థితి
     
    ఎండవేడిమి, విద్యుత్ కోతలతో పశ్చిమకృష్ణా మెట్ట ప్రాంతంలో నాలుగున్నర లక్షల మెట్టపొలాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  ఈప్రాంతంలో  దాదాపు వెయ్యికి పైగా చెరువులురెండు నెలలుగా ఎండిపోయాయి.  మరో వైపు ఎండవేడిమి, విద్యుత్ కోతలతో వ్యవసాయ బోర్లు సరిగా పని చేయడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నంది గామ, నూజివీడు, విస్సన్నపేట ప్రాంతాల్లో కూడా ప్రజలు మంచినీటికి అల్లాడుతున్నారు. పశువులకు కూడా నీటి కొరత ఏర్పడడంతో పశుపోషకులు ఇబ్బందులు పడుతున్నారు.
     
    అడుగంటిన భూగర్బజలాలు
     
    కొద్ది రోజులుగా ఎండవేడిమికి భూగర్భజలాలు కూడా అడుగంటాయి.  బావులలో, బోర్లలో నీరు లోతుకు వెళ్లాయి.  జిల్లాలో డెల్టా ప్రాంతంలో 4.90మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. మెట్టప్రాంతంలో 1.20మీటర్ల లోతులోకి వెళ్లాయని అధికారులు తెలిపారు. జిల్లా సగటున 8.75 మీటర్ల లోతుకు వెళ్లి నట్లు భూగర్బజల  అధికారులు వివరించారు. గత  నెల కంటే ఈ నెలలో రెండు మీటర్ల లోతుకు భూగర్బజలాలు వెళ్లాయి.
     
    25 నుంచి నీరు  విడుదల
     
    ప్రభుత్వం ఈ నెల 25 నాటికి కృష్ణా డెల్లాకు మంచినీరు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 20 నాటికి డెల్టాలో అన్నికాలువలు మరమ్మతులు పూర్తిచేసి అప్పగించాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ై  వర ్షపు నీటితోనైనా తాగడానికి నీరు ఇచ్చేం దుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement