ఆన్‌లైన్ వాహన రిజిస్ట్రేషన్ ప్రారంభం | vehicle online registrations in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ వాహన రిజిస్ట్రేషన్ ప్రారంభం

Published Tue, Mar 1 2016 12:24 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

vehicle online registrations in andhra pradesh

సీతమ్మధార: ఆన్ లైన్ లో వాహనాల రిజిస్ర్టేషన్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. విశాఖ నగరంలోని సిరిపురంలో గల వరుణ్ మోటార్స్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రిటైర్డు హెడ్మాస్టర్ ఈశ్వర శర్మ, శాంతి దంపతులు కొనుగోలు చేసిన వ్యాగన్ ఆర్ వాహనానికి అధికారులు అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సేవలతో వాహనం ఎక్కడ కొంటే అక్కడే రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు వీలుంటుంది.
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జూన్ నుంచి ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ , ఫిట్ నెస్ సర్టిఫికెట్ లను కూడా ఆర్టీవో కార్యాలయం వద్దకు వెళ్లకుండా ఆన్ లైన్ లోనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ట్రాన్స్ పోర్టు కమిషనర్ సుబ్రమణ్యం పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement