వెలుగండ్ల ఎస్సై రౌడీయిజం | Veligandla SI Rude behaviour on Sakshi TV correspondent | Sakshi
Sakshi News home page

వెలుగండ్ల ఎస్సై రౌడీయిజం

Published Sun, May 4 2014 12:47 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

Veligandla SI Rude behaviour on Sakshi TV correspondent

వెలుగండ్ల: సాక్షి టీవీ ప్రతినిధి శ్రీనివాస్‌పై ప్రకాశం జిల్లా వెలుగండ్ల ఎస్సై చంద్రశేఖర్‌ దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కవరేజ్‌కు వెళ్తుండగా శ్రీనివాస్‌ను ఎస్సై అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేశారు.

అక్కడితో ఆగకుండా శ్రీనివాస్ చొక్కా పట్టుకుని పోలీసు స్టేషన్కు లాక్కేళ్లారు. గంటపాటు పీఎస్‌లో నిర్బంధించారు. రౌడీషీటు తెరుస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఎస్సై చంద్రశేఖర్‌ ప్రవర్తించిన తీరుపై జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement