అధిక వడ్డీలతో నిలువు దోపిడీ
ఏటీఎం కార్డులు, బ్యాంకు బుక్‌లు లాక్కుని వడ్డీ కింద జమ
రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
రేణిగుంట : ఆకలి బాధలతో అల్లాడుతున్న పంచాయతీ కాంట్రాక్టు కార్మికులే అధి క వడ్డీల బకాసురులకు టార్గెట్. వారికి అప్పు ఆశ చూపి ఆపై ప్రతాపం చూపిస్తారు. అప్పు తీసుకున్న వారి నుంచి బ్యాంకు పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు లాక్కుని నూటికి రూ.10 నుంచి రూ.12 వరకు వడ్డీ కింద జమ చేసుకుంటారు. తిండికి లేక ఇబ్బందులు పడుతున్నా చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. ఇలా అప్పులు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న 12 మంది రేణిగుంట పం చాయతీ కాంట్రాక్టు కార్మికులు రెండు రోజుల క్రితం రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి పల్లె వీధికి చెందిన వనజాక్షి సుమారు రూ.10 లక్షలకుపైగా రేణిగుంట పంచాయతీ కార్మికులకు అప్పుగా ఇచ్చి దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేణిగుంట ఎస్‌ఐ రఫీ విచారణ చేపట్టారు.
ఏటీఎంలు ఆమె వద్దనే...
రేణిగుంట గ్రామ పంచాయతీ, తిరుచానూరు, తూకివాకం, తిరుపతి రూరల్, అవిలాల, మంగళంతోపాటు దాదాపు 12 పంచాయతీలలోని పారిశుధ్య కార్మికులకు వనజాక్షి దాదాపు 2.20 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి 108 మంది ఏటీఎం కార్డులు ఈమె వద్దనే ఉంచుకుని జీతం వచ్చిన వెంటనే సొమ్ము డ్రా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే ఈమె ఇద్దరి కుమారులతో పాటు మరికొంత మంది రౌడీలను పంపి దౌర్జన్యం చేస్తున్నట్లు సమాచారం. వీరికి అధికార పార్టీ అండదండలు ఉండడంతో ఎవరైనా ప్రశ్నించినా వారి గొంతు నొక్కుతున్నట్లు పారిశు ద్య కార్మికులు వాపోతున్నారు. ప్రస్తు తం రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ఈమెపై కేసు నమోదు కావడంతో పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
వడ్డీల వనజాక్షి
Published Mon, Aug 24 2015 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM
Advertisement
Advertisement