కల్వకుర్తి, న్యూస్‌లైన్: శనివారం కల్వకుర్తి పట్టణంలోని పలు రైస్‌మిల్లులపై విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి 359 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్‌చేశారు. హైదరాబాద్ సిటీ యూనిట్-2కు చెందిన విజిలెన్స్ అండ్ ఎ న్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టణంలోని రవికుమార్ రైస్‌మిల్‌లో 82 క్వింటాళ్లు, వెంకటేశ్వర రై స్‌మిల్‌లో 51 క్వింటాళ్లు, 22 క్వింటాళ్ల నూకలు, వాసవి రైస్‌మిల్‌లో అక్రమంగా దాచిన 70 క్విం టాళ్ల బియ్యాన్ని సీజ్‌చేశారు.
నిబంధనలకు వి రుద్ధంగా.. ఎలాంటి అనుమతులు పొందకుం డా అక్రమంగా బియ్యాన్ని విక్రయిస్తున్నారనే వి శ్వసనీయ సమాచారంతో దాడులు కొనసాగిం చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రైస్‌మిల్లుల నిర్వాహకులపై 6ఏ కేసు నమోదు చే యనున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో డీటీటీఓ సునితారెడ్డి, ఎస్‌ఐలు నాగేశ్వర్, సంతోష్‌కుమా ర్, తహశీల్దార్ హేమమాలిని పాల్గొన్నారు. వారి వెంట స్థానిక తహశీల్దార్ శ్యాంసుందర్, ఆ ర్‌ఐ చారి ఉన్నారు.
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు
Published Sun, Sep 8 2013 5:53 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement