సాక్షి, శ్రీకాకుళం: ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున జిల్లా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు, హోంగార్డులకు నిత్యవసర సరుకులు, మాస్క్‌లు, శానిటైజర్‌లను ఆ ట్రంస్ట్ మేనేజింగ్ డైరెక్టర్, రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి గురువారం పంపిణీ చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, డీసీసీబీ చైర్మన్ పి విక్రాంత్, ఫౌండేషన్ సహ్యలుఉ గోపినాధరెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. (‘తండ్రీ, కొడుకులు హాయిగా అక్కడే ఉండండి’)
అనంతరం విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్ చాలా సులభంగా ఒకరి నుంచి ఒకరికి సోకుతుందన్నారు. ఈ మహమ్మారికి మందు లేనందున కు ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని పిలుపు నిచ్చారు. లాక్‌డౌన్ కారణంగా తలసరి అదాయం తగ్గిపోతుందని తెలిసిన ప్రజల ప్రాణాలు కాపాడానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ కఠిన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితిలో కూడా తమ సేవలందిస్తున్న రెవెన్యూ, పోలీసు, వైద్య శాఖ, వార్డు వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వీడియో బృందాల పనితీరు ప్రశంసనీయం అన్నారు. (రెవెన్యూ లోటును కేంద్రమే పూడ్చాలి)
కాగా త్వరలో ఫార్మ కంపేనీ సహకారంతో అత్యంత పేదలకు సహకారం అందించే ప్రణాళిక చేపడుతున్నామని ఆయన తెలిపారు. కాగా రాజకీయాలకు అతీతంగా పేదలకు సాయం అందించాలని అధికారులకు విజయ సాయిరెడ్డి సూచించారు. ఇక స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ప్రగతి భారత్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తత వలన శ్రీకాకుళంలో కరోనా వైరస్‌ను నిలవరించగలిగారన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలోనే మానవత్వం పరిమళించాలని ఆయన హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment