
సాక్షి, విజయవాడ: ‘జగనన్న చేదోడు’ పథకం అమలుతో రాష్ట్రంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్‌లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్ రెడ్డి చిత్రపటానికి నాయి బ్రాహ్మణులు గురువారం పాలాభిక్షేకం చేశారు. సమస్యలు చెప్పుకునేందుకు వెళితే తోకలు కత్తిరిస్తా, తాటా తీస్తానంటూ ప్రతిపపక్ష నేత చంద్రబాబు బెదిరించారన్నారు. కరోనా కష్టాల్లో సైతం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని నాయిబ్రాహ్మణులు తెలిపారు. తాము చెప్పకుండానే సీఎం జగన్ తమ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. (అనితా రాణి మాటలను రికార్డ్ చేశాం..)
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ‘పార్టీలకతీతంగా పేదలను ఆదుకోవాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. ప్రతీ పేదవాడి సంక్షేమం మా ప్రభుత్వ బాధ్యత. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ,రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తున్నాం. జనం లో సీఎం జగం కు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబుకు భయం పట్టుకొంది. ప్రభుత్వం పై బురదచల్లి ప్రతిష్టను దిగజార్చేందుకు టీడీపీ అండ్ కో కుట్ర పన్నుతోంది. ప్రజాసంక్షేమానికి అడ్డుపడుతున్న చంద్రబాబు ప్రజలకు లేఖరాయటం హాస్యాస్పదం. చంద్రబాబు చేష్టలు నచ్చక మాజీ మంత్రులు కూడా టీడీపీని వదిలేస్తున్నారు. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ లీజుపై చంద్రబాబు విమర్శ గురువింద గింజ సామెతను గుర్తుచేస్తోంది’ అని అన్నారు. (ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు)
Comments
Please login to add a commentAdd a comment