తిరుపతి/ కల్చరల్, న్యూస్‌లైన్: పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సంక్రాంతి పండుగ కోలాహలం ఊపందుకుంది. మంగళవారం భోగి పండుగ కావడంతో సోమవారం కొనుగోలుదారులతో తిరుపతి పట్టణంలోని దుకాణాలు, వ్యాపార సముదాయాలు కిటకిట లాడాయి. పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడ ళ్లు గాంధీరోడ్డు, తీర్థకట్టవీధి, తిలక్‌రోడ్, మునిసిపల్ మార్కెట్ ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పండుగ సామాగ్రి కొనుగోలు చేయడానికి తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.
వస్త్ర వ్యాపారాలు ఊ పందుకున్నాయి. అయితే వ్యాపారులు పూలు, పండ్ల ధరలను అమాంతం పెంచేశారు. కిలో 80-120 రూపాయలుగా ఉన్న చేమంతి పూలు 160-180 రూపాయల ధర పలికింది. అరటి పండ్లు డజను 30-42 రూపాయలుగా ఉండగా 50 రూపాయలకు చేరుకుంది. ఆపిల్, ద్రాక్ష పండ్ల ధరలు రెట్టింపు పలికాయి. సంక్రాంతి పండుగలో ప్రధాన పాత్ర పోషించే పసుపు, కుంకుమలు, ముగ్గులకు వినియోగించే రంగుల పొడులు, చెరకు గడలు, రేగుపండ్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. షోరూంతో పాటు రోడ్డుపక్కన వస్త్ర వ్యాపారాలు జోరుగా సాగాయి. గాజులు, మెహందీ షాపులు మహిళలతో కళక ళలాడుతూ కనిపించాయి. పండుగకు వచ్చేవారు, ఇక్కడి నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వారితో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్లు కిటకిట లాడాయి.
చిత్తూరులో..
చిత్తూరు (కొంగారెడ్డిపల్లె), న్యూస్‌లైన్: సంక్రాం తి పండుగను పురస్కరించుకుని చిత్తూరులోని చర్చివీధి జనంతో కిటకిటలాడింది. సంక్రాంతి సంబరాలను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. పండగ సందర్భంగా ఇళ్ల ముందు రంగవల్లులు వేస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు కొత్తబట్టలు ధరిస్తారు. పశువులను అలంకరించి పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో అవసరమైన సామగ్రిని, కొత్త బట్టలను కొనుగో లు చేసేందుకు చిత్తూరుకు సమీపంలోని 10 మండలాల ప్రజలు తరలిరావడంతో చర్చివీధి కిటకిటలాడింది. అయితే వ్యాపారులు ఒక్కసారిగా వస్తువుల ధరలను పెంచేశారు. దీంతో సామాన్య ప్రజలు రోడ్డుపై విక్రయించే బట్టలను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపారు. చర్చివీధిలో కొనుగోలుదారుల రద్దీ దృష్ట్యా పోలీ సులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద ఖాళీ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం కేటాయిం చారు. పల్లెలకు వెళ్లే వారితో ఆర్టీసీ బస్టాండ్‌లో రద్దీ ఏర్పడింది. కొందరు ఇతర వాహనాలను ఆశ్రయించారు.
పల్లెలు, పట్టణాల్లో కోలాహలం
Published Tue, Jan 14 2014 3:30 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
Advertisement
Advertisement