Fruit prices
-
‘బాబోయ్ మందు’.. పైనాపిల్ బీర్‌కు ఫుల్గిరాకీ
‘హమ్ మందు నహీతో బతుకు నయ్ సక్తాహై’.. లాక్డౌన్ టైంలో చాలామంది మందు బాబులు వెల్లడించిన అభిప్రాయం ఇదే. అంతెందుకు ఫస్ట్ వేవ్ టైంలో మందు దొరక్క.. శానిటైజర్లు, ఇంట్లోనే మందు ప్రయోగాలతో ఘోరంగా దెబ్బతిన్నవాళ్లూ లేకపోలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో మందు బాబులకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో ఇంట్లోనే బీర్లు తయారు చేసుకుంటున్నారు. దీంతో పైనాపిల్ ధరలకు రెక్కలొచ్చాయి. సౌతాఫ్రికాలో లాక్డౌన్ 4 లెవల్లో భాగంగా 14 రోజులపాటు లిక్కర్ షాపులు మూతపడ్డాయి. దీంతో పైనాపిల్ పండ్ల ద్వారా ఇంట్లోనే బీర్లు తయారు చేసుకుంటున్నారు మందుబాబులు. ఈ ప్రభావంతో పైనాపిల్ పండ్ల ధరలు 74 శాతం పెరిగాయి. లాక్డౌన్-మందు దొరకని పరిస్థితుల నేపథ్యంలోనే పైనాపిల్‌కు ఒక్కసారిగా డిమాండ్ సౌతాఫ్రికా అగ్రిమార్క్ ట్రెండ్స్(ఏఎంటీ) గురువారం వెల్లడించింది. అయితే జూన్ చివరి వారం నుంచే లిక్కర్‌పై ఆంక్షలను అమలు చేస్తోంది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. దీంతో అప్పటి నుంచే పైనాపిల్ ధరలు స్వల్ఫంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా 14 రోజుల నిషేధం నేపథ్యంలో.. ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. ఒకవేళ లాక్డౌన్ కొనసాగితే మాత్రం పైనాపిల్ ధరలు ఊహించని రేంజ్‌కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. -
పండగ వేళ.. ‘పండ్ల’ గోల..!
సాక్షి, ముంబై: రంజాన్ మాసం కావడంతో పండ్ల ధరలు కొండెక్కనున్నాయి. మార్కెట్లో పండ్ల కొరత లేనప్పటికీ పండగ సీజన్ నేపథ్యంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేసినట్లు పలువురు భావిస్తున్నారు. నగరంలోని వాషి ఏపీఎంసీ మార్కెట్ పండ్లతో కళకళలాడుతోంది. రంజాన్ మాసంలో చాలా మంది నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను మాత్రమే ఎంచుకుంటారు. ఈ మేరకు తర్బూజ, పొప్పిడి పండు, పైనాపిల్ పండ్ల ధరలు పెరగనున్నాయి. ఈ సందర్భంగా పండ్ల వ్యాపారుల సంక్షేమ సంఘ ప్రతినిధి విజయ్ బేండే మాట్లాడు తూ.. రంజాన్ మాసంలో పండ్లకు ఎక్కువ డిమాం డ్ ఉంటుందన్నారు. దీంతో ఈ మాసంలో పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయని తెలిపారు. హోల్‌సేల్ మార్కెట్లో తర్బూజ, పొప్పిడి, పైనాపిల్ పండ్ల ధరలు కి.లో. రూ. 20 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. పండ్ల వ్యాపారి బాబూరావ్ హ్యాండే మాట్లాడుతూ.. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో భారీగా పెరిగే పండ్ల ధరలు మాసాంతంలో ధరలు కూడా తగ్గుతాయని తెలిపారు. మామూలుగా పండ్ల ధర లు వాటి సరఫరాపైన ఆధారపడి ఉంటాయి. కానీ ఇప్పుడు పండగ సీజన్ కావడంతో డిమాండ్ మేర కు ధరలు పెంచుతున్నారని అభిప్రాయపడ్డారు. తర్బూజ, బొప్పాయి కొంతమేరకు రాష్ర్టం లోని వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుండగా, ఎక్కువ శాతం ఉత్తర భారత రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. పైనాపిల్ మాత్రం కేరళ రాష్ర్టం నుంచి దిగుమతి అవుతోంది. రంజాన్ మాసంలో నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు 60 నుంచి 70 ట్రక్కుల వరకు వాషిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు చేరుకుంటాయి. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో డ్రైఫ్రూట్స్‌కు కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నారు. డ్రైఫ్రూట్స్ వ్యాపారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండ్లు, కూరగాయల ధరలు పెరగిపోవడంతో ఇబ్బంది పడుతున్న నగర వాసులు, నిత్యం ఎక్కువ ధర పలుకుతున్న డ్రైఫ్రూట్స్‌ను కొనుగోలు చేయలేరని విచారం వ్యక్తం చేశారు. ఈసారి తమ వ్యాపారం నడవడం కష్టమేనన్నారు. రంజాన్ సమీపిస్తున్నప్పటికీ తమకు ఇప్పటి దాకా ఎలాంటి ఆదాయం లేదన్నారు. డ్రైఫ్రూట్స్‌కు డిమాండ్ తక్కువగా ఉండడంతో వీటి ధర కూడా నిలకడగా ఉంటుందని మరో వ్యాపారి తెలిపారు. రంజాన్ మాసంలో హోల్‌సేల్ మార్కెట్లో ఖర్జూరకు కి.లో రూ.25 నుంచి 60 వరకు ధర పలుకుతోందని మరో డ్రైఫ్రూట్స్ వ్యాపారి పేర్కొన్నారు. ఖాజూ కిలో రూ.640 నుంచి 700 వరకు పలుకుతోంది. బాదామ్ కి.లో. రూ.1,400 నుంచి రూ.2,500 ధర పలుకుతోంది. అంజీర్ కిలో రూ.360 నుంచి 900, వాల్నట్ రూ.860 నుంచి 1,500, పిస్తా రూ.1,400 నుంచి 1,500 వరకు ధర పలుకుతోంది. -
పల్లెలు, పట్టణాల్లో కోలాహలం
తిరుపతి/ కల్చరల్, న్యూస్‌లైన్: పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సంక్రాంతి పండుగ కోలాహలం ఊపందుకుంది. మంగళవారం భోగి పండుగ కావడంతో సోమవారం కొనుగోలుదారులతో తిరుపతి పట్టణంలోని దుకాణాలు, వ్యాపార సముదాయాలు కిటకిట లాడాయి. పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడ ళ్లు గాంధీరోడ్డు, తీర్థకట్టవీధి, తిలక్‌రోడ్, మునిసిపల్ మార్కెట్ ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పండుగ సామాగ్రి కొనుగోలు చేయడానికి తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. వస్త్ర వ్యాపారాలు ఊ పందుకున్నాయి. అయితే వ్యాపారులు పూలు, పండ్ల ధరలను అమాంతం పెంచేశారు. కిలో 80-120 రూపాయలుగా ఉన్న చేమంతి పూలు 160-180 రూపాయల ధర పలికింది. అరటి పండ్లు డజను 30-42 రూపాయలుగా ఉండగా 50 రూపాయలకు చేరుకుంది. ఆపిల్, ద్రాక్ష పండ్ల ధరలు రెట్టింపు పలికాయి. సంక్రాంతి పండుగలో ప్రధాన పాత్ర పోషించే పసుపు, కుంకుమలు, ముగ్గులకు వినియోగించే రంగుల పొడులు, చెరకు గడలు, రేగుపండ్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. షోరూంతో పాటు రోడ్డుపక్కన వస్త్ర వ్యాపారాలు జోరుగా సాగాయి. గాజులు, మెహందీ షాపులు మహిళలతో కళక ళలాడుతూ కనిపించాయి. పండుగకు వచ్చేవారు, ఇక్కడి నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వారితో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్లు కిటకిట లాడాయి. చిత్తూరులో.. చిత్తూరు (కొంగారెడ్డిపల్లె), న్యూస్‌లైన్: సంక్రాం తి పండుగను పురస్కరించుకుని చిత్తూరులోని చర్చివీధి జనంతో కిటకిటలాడింది. సంక్రాంతి సంబరాలను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. పండగ సందర్భంగా ఇళ్ల ముందు రంగవల్లులు వేస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు కొత్తబట్టలు ధరిస్తారు. పశువులను అలంకరించి పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో అవసరమైన సామగ్రిని, కొత్త బట్టలను కొనుగో లు చేసేందుకు చిత్తూరుకు సమీపంలోని 10 మండలాల ప్రజలు తరలిరావడంతో చర్చివీధి కిటకిటలాడింది. అయితే వ్యాపారులు ఒక్కసారిగా వస్తువుల ధరలను పెంచేశారు. దీంతో సామాన్య ప్రజలు రోడ్డుపై విక్రయించే బట్టలను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపారు. చర్చివీధిలో కొనుగోలుదారుల రద్దీ దృష్ట్యా పోలీ సులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద ఖాళీ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం కేటాయిం చారు. పల్లెలకు వెళ్లే వారితో ఆర్టీసీ బస్టాండ్‌లో రద్దీ ఏర్పడింది. కొందరు ఇతర వాహనాలను ఆశ్రయించారు. -
పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి
బెంగళూరు, న్యూస్‌లైన్ : శ్రీ వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో పూలు, పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. నాలుగైదు రోజులతో పోల్చుకుంటే గురువారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో రూ.10 కంటే త క్కువ ధర ఉన్న చెండు పూలు ప్రస్తుతం రూ.100కు పెరిగింది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ధరలు పెరగడానికి కారణమయ్యాయి. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడి పూలు, పండ్ల పంటలు దెబ్బతిన్నాయి. మరో పక్క వర్షాభావ పరిస్థితులు అనేక చోట్ల పంటలే పెట్టలేదు. వరలక్ష్మి వ్రతానికి పూలు, పండ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. రైతుల వద్ద వ్యాపారులు ఉత్పత్తులన్నిటినీ కొనుగోలు చేయడంతో, ఇక వారు చెప్పిన ధరలనే వినియోగదారులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం ఈ ధర మరింతగా పెరగవచ్చని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మల్లెపూల ధర కేజీ రూ.1,000, కనకాంబరాలను రూ.1,500 వరకు విక్రయించారు. మూడు రోజుల కిందటి వరకు మల్లెల ధర రూ.300, కనకాంబరాలు రూ.400-500 పలికేవి. పండ్ల ధరలు కూడా చుక్కలనంటుతుండడంతో వినియోగదారులు హాప్కామ్స్ను ఆశ్రయిస్తున్నారు. మార్కెట్లతో పోల్చుకుంటే హాప్‌కామ్స్‌లో ధర తక్కువగా ఉంటోంది. గురువారం సిటీ మార్కెట్లో పండ్లు, పూల ధరలు కింది విధంగా ఉన్నాయి.